అంకెలు, లాజిక్కులతో ఎంతటివారి నోటినైనా మూయించగలిగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా పోలవరంపై బాంబు పేల్చుతానంటున్నారు. అందుకు సోమవరం ముహూర్తం అని ప్రకటించారు. దీంతో దేవుడా.. సోమవారం రాకపోతే బాగుణ్నని పాలక టీడీపీ భయపడుతోంది.
పోలవరం జాతకం మొత్తాన్నీ ఇప్పటికే భూతద్దంతో చూసిన ఉండవల్లి దీనిపై చంద్రబాబు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపైనా సమాచారహక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేశారు. అందుకు స్పందించిన సంబంధిత శాఖ అధికారులు… తమ వద్ద చాలా డేటా ఉందని ఏంకావాలో వచ్చి మీరు చూసుకుని తీసుకెళ్లండి అంటూ కబురు పెట్టారు. దీంతో రాజమండ్రిలోని ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లిన ఉండవల్లి మొత్తం పైళ్లను తిరగేసి కావాల్సిన పత్రాలన్నింటిని సేకరించారు.
తనకు కావాల్సిన సమచారం అంతా తీసుకున్న ఉండవల్లి దానిపై స్టడీ చేసి సోమవారం అందరి లెక్కలు తేల్చేస్తానని ప్రకటించారు. పోలవరంలో ఎవరి వాటా ఎంతో బయట పెడుతానన్నారు. ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి కాబట్టి ఎక్కడ తేడా జరిగిందో.. ఎవరు తేడా చేశారో ప్రజలకు వివరిస్తానని ధీమాగా చెప్పారు. పోలవరం నిధుల ఖర్చు - పనులు జరిగిన వేగం తాలుకు లెక్కలు - అత్యుత్సాహంతో చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు - కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ప్రత్యుత్తరాలు వంటి అన్ని కీలక ఆధారాలను ఉండవల్లి సేకరించినట్టు చెబుతున్నారు. దీంతో ఉండవల్లి ఏం కొంప ముంచుతాడో అని పాలక టీడీపీ తెగ టెన్షన్ పడుతోందట.