సీఎం జగన్ కి ఉండవల్లి లేఖ ... ఎందుకంటే ?

Update: 2019-11-14 09:54 GMT
కాంగ్రెస్ బహిష్కృత నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి భహిరంగ లేఖ రాసారు. ఈ లేఖ ద్వారా సీఎం జగన్ కి , ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసారు. విభజన సమయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఆ అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా గతంలో పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. 18 నుండి జరగనున్న శీతాకాల సమావేశాల్లో కచ్చితం గా ఏపీ విభజన అంశం ప్రస్తావన కు తీసుకు వచ్చే లా వైసిపి ఎంపీలు నోటీసులు ఇవ్వాలని ఆయన తెలిపారు.

కాగా, రాష్ట్ర విభజన జరగ లేదంటూ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి. తలుపులు మూసి బిల్లు పాస్ కాకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయిందని మోసం చేశారని చాలా సార్లు చెప్పారు. దీనిపై ఏపీ ఎంపీలు మాట్లాడాలని పలుమార్లు అన్ని పార్టీల ఎంపీలను ఉండవల్లి కోరారు. ఇదే విషయమై గతం లో ఓ సారి అప్పటి సీఎం చంద్రబాబు ను కూడా కలిశారు ఉండవల్లి.

ఏ పార్లమెంట్ లో అయితే  హడావుడి గా ఏపీ విభజన జరిగిందో ఆ పార్లమెంట్ లోనే  ఇప్పటి వరకు ఏపీ విభజన పై చర్చ జరగ లేదని, ఈ సారైన చర్చ జరిగేలా వైసిపి పట్టు బట్టాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం కి రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ఇచ్చిన హామీలు నేటికి నెర వేరక పోవడం తో, ఏపీ అప్పుల రాష్ట్రం గా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లో పార్లమెంటు లో ఏపీ విభజన పై చర్చ జరిగితే రాష్ట్రానికి కొంతైన మంచి జరుగుతుంది అని అందరూ భావిస్తున్నారు. అలాగే  ఇంగ్లీష్‌ విద్య పై  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని, తెలుగు ను ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్‌ మాధ్యమం లో బోధిస్తే మంచిదని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.   


Tags:    

Similar News