ప్రపంచంలోని పలు దేశాల్ని వణికిస్తూ.. అండర్ వరల్డ్ ప్రముఖ డాన్ లలో ఒకడైన ఛోటా రాజన్ పోలీసుల చేతికి చిక్కాడు. దాదాపు 20 ఏళ్లుగా ఇంటర్ పోల్ ను.. భారత పోలీసులకు దొరకని అతగాడు.. తాజాగా ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారంతో అతడ్ని ఇండోనేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అండర్వరల్డ్ లో ప్రముఖుడైన దావూద్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మిగిలిన ఛోటా రాజన్ తదనంతరం వీరి మధ్య శత్రుత్వం పెరిగింది. అప్పటి నుంచి దావూద్.. ఛోటా రాజన్ వర్గాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఇరువురు దేశం విడిచి వెళ్లిపోయినా.. తన అనుచరులతో దేశంలో దందా నిర్వహిస్తున్నాడు. అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాత్ర ఉన్న ఛోటా రాజన్ కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు.
ముంబయి నేర సామ్రాజ్యంలో ఛోటారాజన్ పాత్ర ఎక్కువే. పోలీసుల నుంచి.. నిఘా వర్గాల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఛోటా రాజన్ ఇండోనేషియాలోని బాలిలో ఆదివారం పట్టుబడినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అతగాడు ఇండోనేషియా అధికారుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నా.. అధికారికంగా మాత్రం ఎవరూ కన్ఫర్మ్ చేయని పరిస్థితి. ఇక.. ఛోటా రాజన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. పోలీసులకు చిక్కిన ఛోటా రాజన్ వైనం వెనుక దావూద్ గ్యాంగ్ హస్తం ఉందన్న మాట వినిపిస్తోంది.