జాబు రావాలంటే..బాబు రావాలి...ఈ స్లోగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార పర్వంలో ఈ స్లోగన్ టాప్‌లో నిలిచింది. బాబు గెలుపునకు కూడా తోడ్పడిందని అంటుంటారు. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన ఊహించిన స్థాయిలో లేదు. అధికార పగ్గాలు చేపట్టి మూడున్నరేళ్లు దాటుతున్నప్పటికీ....ఈ హామీని నిలబెట్టుకోలేకపోతుండటంతో..సహజంగానే నిరసనలు ఎదురవుతుంటాయి. అలా సాక్షాత్తు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎదురైంది.
తన సొంత జిల్లా చిత్తూరులోనే సీఎం చంద్రబాబుకు ఈ పరాభవం ఎదురైంది. తిరుపతిలోని తనపల్లి హౌసింగ్ గృహప్రవేశ కార్యక్రమంలోనూ, ఎపి ఎన్జీవో మహాసభల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న నేపథ్యంలో 'బాబూ జాబెక్కడ' అంటూ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో లక్ష్మీపురం సర్కిల్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో సీఎంను ఎక్కడ అడ్డుకుంటారోనని ముందస్తుగా ఈస్టు పోలీసులు పహారా కాసి 13 మంది నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు చంద్రబాబు నిరుద్యోగభృతి ఇస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వారి ఓట్లతో గెలుపొందారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంతవరకూ ఒక్క జాబు కూడా రాలేదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్నారు. నిరుద్యోగులకు రూ.2 వేలు భృతి ఇస్తామని చెబుతూనే కాలయాపన చేస్తున్నారన్నారు.
టీటీడీలో ఖాళీగా ఉన్న ఆరువేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులను భర్తీ చేయాలన్నారు. చంద్రబాబునాయుడు కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు నాయకులను సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.