ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఆసియన్లపై దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా లాస్ ఏంజిల్స్ లో ఇదే తరహాలో ఓ ఘటన చోటు చేసుకుంది. సిటీ బస్సులో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిని ఆసియన్ గా భావించిన అదే బస్సులోని ఓ యువకుడు అందరి ముందు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. వృద్ధురాలు అని కూడా జాలి లేకుండా ఆమె ముఖం, కండ్లు, తల భాగంపై తీవ్రంగా కొట్టాడు.
అలాగే, అంతటితో ఆగకుండా ఆమెను ఈడ్చి బస్సులోంచి బయట పడేశాడు. ఇంత జరుగుతున్న బస్సులోని ప్రయాణికులు గానీ, బస్ డ్రైవర్ గానీ ఆ యువకుడిని వారించే ప్రయత్నం చేయలేదు. చివరకు ఓ వ్యక్తి 911 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీనితో వెంటనే పోలీసులు బస్సు వద్దకు చేరుకుని గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరిలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన 23 ఏళ్ల యాస్మిన్ బీస్లీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యాస్మిన్ దాడి తో వృద్ధురాలి కండ్లు, మెడ, తల భాగంపై గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, యువకుడు ఆసియన్ గా భావించి దాడి చేసిన వృద్ధురాలు మెక్సికన్ అమెరికన్ అని బయటపడింది.