బెజవాడ యువతి హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌ ..

Update: 2020-10-16 16:10 GMT
ప్రేమోన్మాదానికి బలైపోయిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్ర తో బాధితురాలు మాట్లాడిన ఫోన్‌ కాల్స్‌ లీకవుతున్నాయి. అలాగే అక్టోబర్‌ 3న ఇన్‌స్టా గ్రామ్ ‌లో యువతి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. గడిచిన ఆరు నెలలుగా తాను సఫర్ అవుతున్నట్లు యువతి ఆ వీడియోలో చెప్తుంది.

అసలు తనలో ఎలాంటి నెగెటివ్ షేడ్స్ లేవని, తన మాటల్లో పదే పదే చెప్తోంది. ప్రస్తుతం నేను పూర్తిగా డైలమాలో ఉన్నానని . తనకు స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉందంటూ వీడియో లో చెప్తుంది. అలాగే ఆ వీడియోలో నాగేంద్ర గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అతనో సైకో అని.. తన వెంట పడ్డాడని వివరించింది. రెండున్నర ఏళ్ల క్రితం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నా.. అతని క్యారెక్టర్ ఏంటో తెలిసాక.. కట్ చేశానని చెప్పుకొచ్చింది. 2 ఏళ్ల తరువాత అతని సైకో ఇజం అర్థమైంది ఇన్‌స్టా లో చెప్పింది. తనకు థ్రెట్ కాల్స్, థ్రెట్ మెసేజ్‌లు వస్తున్నాయని ఇన్‌ స్టాగ్రామ్‌ లో లైవ్ ‌లో చెప్పింది ఆ యువతి. ఒక మహిళ వలన తాను మోసపోయానని బాధ పడింది.

తాను మహిళా కాలేజీలో చదివాను అని, మహిళగా నా లిమిట్స్ నాకు తెలుసు. అందుకే కంప్లైంట్ చేయాలేకపోయానంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. 6 నెలలుగా బాధపడుతున్నానని, తనను ఉన్నత స్థానంలో చూడాలని తన పేరెంట్స్ అనుకున్నారంటూ ఇన్‌ స్టా లైవ్‌ లో చెప్పింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. తన కెరీర్ నాశనం చేయాలని అతను చూసాడని… అయినా తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా అని అన్నిటికీ పోరాడాలి అనుకుంటున్నా అంటూ వీడియోలో స్పష్టం చేసింది.

మరోవైపు తామిద్దరం వివాహం చేసుకున్నామని, అది వారి తల్లిదం‍డ్రులు ఇష్టం లేకపోవడంతో ఇద్దరం ఆత్మాహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. అలాగే గతంలోనే వీరికి పెళ్లి జరిగింది అనడానికి సాక్ష్యంగా కొన్ని ఫోటోలు , ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. ఇదే నిందుతుడు చెప్తున్నాడు. ఇక బాధిత యువతీ తల్లిదండ్రుల వాదన అయితే మరోలా ఉంది. తమ కూతురిని అన్యాయంగా చంపేశారని , పెళ్లి కాలేదు అని , కావాలనే ప్రచారం చేస్తున్నారని వారు విలపిస్తున్నారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ ఆడియో లీకవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీనితో పోలీసులు ఈ కేసు సవాలుగా మారింది. లీకైన ఆడియోలు, ఫోన్‌ కాల్స్‌ డేటా , ఇన్ స్టాగ్రామ్ వీడియో , మరిన్ని ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుని దిశా స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఓ యువతి ప్రాణం మాత్రం అన్యాయంగా గాల్లో కలిసిపోయింది.
Tags:    

Similar News