ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సరి..బేసి విధానాన్ని మరోసారి ప్రయోగాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ వివరాల్ని వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ వివరాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఒక వ్యక్తి కలకలం రేపాడు. తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఆమ్ఆద్మీ అవినీతి బయటపడిందని పేర్కొన్న వ్యక్తి.. కావాలంటే ఆ వివరాల్ని చూసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మీదకు సీడీల్ని విసిరారు.
ఊహించని పరిణామానికి అక్కడున్న పోలీసులు.. పార్టీ నేతలు అప్రమత్తమవుతున్నారు. ఇదే క్రమంలో ఆ యువకుడు తన బూటును సీఎం మీదకు విసిరారు. అయితే.. అది కేజ్రీవాల్ మీద పడకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మీద బూటు విసిరిన వ్యక్తి తన పేరు వేద్ ప్రకాశ్ శర్మగా పేర్కొన్నారు. వేద్ ప్రకాశ్ ను ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తగా గుర్తించారు. ఈ హఠాత్ పరిణామానికి కాస్త షాక్ అయినప్పటికీ వెంటనే తేరుకున్న ఆమ్ ఆద్మీ కార్యకర్తలు వేద్ ప్రకాశ్ మీద దాడికి పాల్పడ్డారు.