కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబై పర్యటనలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కలకలం సృష్టించాడు. ఆయన పర్యటనలో భద్రతా లోపం తాజాగా వెలుగుచూసిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అమిత్ షా మహారాష్ట్ర రాజధాని ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భద్రతా లోపం బయటపడిందని అధికారులు చెబుతుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్ షా వెంటే ఓ వ్యక్తి తిరిగాడని పోలీసులు చెబుతున్నారు. ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు ముంబైలో పర్యటించారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై వారితో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7తో ఆ పర్యటన ముగిసింది. అయితే.. కేంద్ర హోం మంత్రి పర్యటనలో ఓ భద్రతా వైఫల్యాన్ని పోలీసులు తాజాగా గుర్తించారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి అమిత్ షా సెక్యూరిటీలో కనిపించాడని పోలీసులు చెబుతున్నారు. కొన్ని గంటల పాటు అమిత్ షాకు దగ్గర్లోనే చక్కర్లు కొట్టాడని అంటున్నారు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబై పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ ఐడీతో అమిత్ షా సెక్యూరిటీలో చేరిన అతడిని 32 ఏళ్ల హేమంత్ పవార్‌గా గుర్తించారు.
మరోవైపు అమిత్ షా సెక్యూరిటీ టీమ్‌లో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం హేమంత్ పవార్‌ని అరెస్టు చేశారు. ఐదు రోజుల పాటు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ఎంపీకి అనుచరుడినని నిందితుడు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. అతడు ఏ ఎంపీ పేరు చెప్పాడా, లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు.
అలాగే నిందితుడు హేమంత్ పవార్ మలబార్ హిల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసాల ఎదుట కూడా సంచరించాడని చెబుతున్నారు. కాగా నిందితుడి వద్ద ఒక ఎంపీ కార్యదర్శి గుర్తింపు కార్డు దొరికిందని చెబుతున్నారు.
కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ-ఏకనాథ్ షిండే ఆధ్వరంలోని శివసేన ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరే-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ముంబైలో పర్యటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.