బ‌డ్జెట్ డిక్లేర్ః ప్ర‌యాణం ఏదైనా ఫుల్ జోష్‌

Update: 2016-02-29 07:20 GMT
కేంద్ర బ‌డ్జెట్ సంద‌ర్భంగా విత్త మంత్రి అరుణ్ జైట్లీ రోడ్లు - ర‌వాణ స‌దుపాయాల‌కు పెద్ద పీట వేశారు. మొత్తం 19.78 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన జైట్లీ ఇందులో ప్రణాళికా వ్యయం 5.5 లక్షల కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం 14.28లక్షల కోట్లుగా వెల్ల‌డించారు. ఈ బ‌డ్జెట్ రోడ్లు - రైలు - విమాన ప్ర‌యాణాల‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్యం క‌ల్పించారు.

రోడ్లు - జాతీయ రహదారులు - రైల్వేలకు రూ. 2,21,246 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త‌న ప్ర‌సంగంలో వెల్లడించారు. దేశంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన జైట్లీ జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 97 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ. 27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతామన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ప్యాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం చేపడుతామన్నారు. రవాణా రంగంలో లైసెన్స్‌రాజ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్యాసింజర్ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు పచ్చజెండా ఊపామ‌న్నారు. అసంపూర్తిగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణకు 150 కోట్లు కేటాయించామని  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News