కేంద్ర విదేశాంగ మంత్రి విజయవాడ పర్యటనకి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా అయన మాట్లాడుతూ తెలుగు వారిపై ప్రసంశలు కురిపించారు. ప్రపంచంలోని పలు దేశాలకి వెళ్లానని , ప్రతి చోటా కూడా తెలుగు వారు ఉన్నారని , తెలుగువారు తెలివైనవారని , అలాగే కష్టజీవులు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంకా అయన మాట్లాడుతూ .. దేశంలో కరోనా నియంత్రణ అదుపులో ఉందని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పురోగాభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు దేశంలో వాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయామన్నారు.
కరోన తరువాత 11 శాతం వృద్ధి దేశంలో ఉందని, కేంద్ర మంత్రి బడ్జెట్‌ను 6 స్థంబాలుగా విభజించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. బడ్జెట్ లో అనేక రంగాలకు పెద్దపీట వేసి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. బడ్జెట్ లో రూ.2లక్షల కోట్లతో ఉత్పత్తి రంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం టెక్స్ టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
ఏపీలో త్వరలో మూడు క్లస్టర్స్ ఏర్పాటు కాబోతున్నాయని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం ఆర్ధికంగా స్థిరపడుతుందన్నారు. రాష్ట్రాల విమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, ఆయా రాష్ట్రాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ ను రూపొందించామని , రాజకీయాల కోసం బడ్జెట్ పై విమర్శలు చూస్తున్నారని, ఏపీలో గ్లోబల్ ఇంపాక్ట్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. రక్షణా రంగానికి అధికంగా నిధులు కూడా కేటాయించారని, కేంద్ర మంత్రుల బృందం ఈ అంశంపై భేటీ అవుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు.