కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. డీస్ఎబిలిటీ కంపెన్సేషన్ (వైకల్య పరిహారం)ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందిరికీ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. డ్యూటీలో ఉన్నప్పుడు అంగవైకల్యం సంభవించిన ఉద్యోగులకు పరిహారం అందిస్తామని మోడీ సర్కార్ తెలిపింది. వీరిని ఉద్యోగాల్లో కొనసాగిస్తామని పేర్కొంది.
తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారి చేసినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సీఏపీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పలు విభాగాల్లో పనిచేసే వారికి భారీ ఊరట కలుగనుంది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేశామని జితేంద్రసింగ్ తెలిపారు.
2004 జనవరి 1 లేదా తర్వాత ఉద్యోగాల్లోకి చేరిన వారికి.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్.పీఎస్ పరిగణలోకి వచ్చే వారికి ఎలాంటి పరిహారం ఉండేది కాదని కేంద్రమంత్రి తెలిపారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన కొత్తరూల్స్ వల్ల పరిహారం లభిస్తుందని తెలిపారు.
మోడీ సర్కార్ నిబంధనలను సరళతరం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు లేని జీవనం కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.