తెలంగాణ మంత్రుల తీరు పై కేంద్ర‌మంత్రి ఆగ్ర‌హం

Update: 2020-07-12 06:30 GMT
మ‌హ‌మ్మారి వైరస్ సోకిన మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే చికిత్స పొందాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మంత్రుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైరస్  చికిత్స కోసం ప్రజలు ప్రభుత్వ ఆస్ప‌త్రికి వస్తుంటే మంత్రులు మాత్రం ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొంద‌డంపై మండిప‌డ్డారు. ఇక నుంచి పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ సంద‌ర్భంగా గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించి ప్రభుత్వ ఆస్ప‌త్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్ప‌ష్టం చేశారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే  తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పరిస్థితులపై మంత్రి ఈటల అలాగే అధికారులతో మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైద‌రాబాద్ లోనే ఎక్కువ‌గా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించిన‌ట్లు వివ‌రించారు. వైద్య సిబ్బందికి, వైర‌స్ బాధితులకు ధైర్యం కల్పించటానికే తాను గాంధీ ఆస్ప‌త్రికి వచ్చిన‌ట్లు తెలిపారు. ఈ ఆస్ప‌త్రిలో 250కి పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ ఆస్ప‌త్రులను కట్టడి చేయాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్ప‌ష్టం చేశారు. గాంధీ ఆస్ప‌త్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. గాంధీ ఆస్ప‌త్రిలో పేషెంట్లకు మానసిన ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత స్థానిక (సికింద్రాబాద్‌) ఎంపీగా త‌న‌పై ఉందని గుర్తుచేశారు.
Tags:    

Similar News