మీరు చదివింది నిజమే. కేంద్ర కుటుంబ - ఆరోగ్య సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ కు ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఊహించని చేధు అనుభవం ఎదురయింది. తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ కు వెళ్లి తిరిగి వస్తున్న ఆమెను కొందరు ఆకతాయిలు వేధించారు. ఆమె కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినా పట్టించుకోని ఆకతాయిలు మంత్రి - సెక్యూరిటీ సిబ్బందిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు.
మీర్జాపూర్ లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుప్రియ తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. యువకుల ప్రయాణిస్తున్న కారుకు నెంబర్ ప్లేట్ లేదు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్టు చేసి.. కారును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు సామాన్యులకు సర్వసాధారణం. హైవేల మీదనే అమాయకులను అడ్డగించి అత్యాచారాలకు పాల్పడి హత్య చేసిన ఘటనలు ఉన్నాయి.
అయితే అధికారంలోకి వచ్చిన యోగీ ఆధిత్యనాథ్ పాలనలో మార్పు ఉంటుందని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఛాయలు ఏ మాత్రం కానరావడం లేదు. . ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆకతాయిలు వేధింపులకు దిగడం యూపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళల రక్షణ కోసం యూపీ ప్రభుత్వం యాంటీ రోమియో స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసింది. కానీ వాటి నుండి ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు. ఇప్పటికయినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుని భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలి.