అత్యున్నత స్థానాలకు చేరుకున్న వారెప్పుడూ తామెంత తోపులమన్న విషయాన్నే చెబుతుంటారు. తాము ఉన్నత స్థానానికి ఎదిగే క్రమంలో పడిన కష్టాల గురించి చెప్పినా.. అదంతా ఫీల్ గుడ్ మూవీ కథలా చెబుతారే తప్పించి.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటోళ్లు చాలా తక్కువమంది కనిపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గతాన్ని ఎవరూ అడగకున్నా.. మాటల సందర్భంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఘనత కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీకే చెల్లుతుంది. బుల్లితెర నటిగా సుపరిచితులైన ఆమె.. సెలబ్రిటీ స్టేటస్ ను సాధించటానికి ముందు పడిన కష్టాల్ని చెప్పుకునేందుకు మొహమాటపడలేదు. ఆ మాటకు వస్తే.. తాను ఆ సమయంలో పడిన ఇబ్బందుల్ని అప్పుడప్పుడు వెల్లడించేవారు.
మోడీ 2 సర్కారుతో పోలిస్తే.. మోడీ 1 సర్కారులో స్మ్రతి తరచూ వార్తల్లో ఉండేవారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ నేత.. స్వశక్తితో ఎదిగారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తనకు సంబంధించి ఇప్పటివరకు బయటకు రాని ఒక విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి ఢిల్లీ ఫుట్ పాత్ మీద పుస్తకాలు అమ్మేవారని వెల్లడించారు. ఆర్మీ కార్యాలయానికి సమీపంలోని రోడ్డు మీద తన తండ్రి పుస్తకాలు అమ్మేవారని చెప్పారు.
తాజాగా తాను రాసిన పుస్తక తొలి ప్రతిని తన తండ్రికే ఇచ్చినట్లుగా చెప్పారు. తన తండ్రికి పుస్తకాన్ని ఇచ్చిన నలభై ఎనిమిది గంటల అనంతరం.. ఆయన ఫోన్ చేసి.. ‘పైసా వసూల్’ పుస్తకమని కితాబును ఇచ్చారని చెప్పారు. పుస్తకాలు చాలానే వస్తాయి కానీ.. కొన్ని పుస్తకాలకు ఉండే ఆదరణ అంతా ఇంతాకాదని.. ఆ విషయాన్ని పుస్తకాల్ని అమ్మే తన తండ్రికి అనుభవం ఉందని చెప్పిన ఆమె.. తన పుస్తకానికి ఇచ్చిన కాంప్లిమెంట్ ను తాను మర్చిపోలేనని చెప్పారు. కేంద్రమంత్రి లాంటి ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత కూడా.. తమ గతం గురించి ఎలాంటి దాపరికం లేకుండా చెప్పుకోవటం అందరికి సాధ్యం కాదు. ఆ విషయంలో కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ గొప్పతనాన్ని కీర్తించకుండా ఉండలేం.