కొన్నిసార్లు అంతే. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సమస్యలు మీద పడిపోతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది మోడీ సర్కారుకు. ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న ప్యారడైజ్ పత్రాల్లో తన మంత్రి వర్గంలోని మంత్రిగారు ఒకరి పేరు రావటం.. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటివరకూ స్పందించకపోవటంతో.. అవినీతికి తమ పాలనలో చెక్ పెడతామన్న మోడీ గంభీరమాటలు ఉత్తవేనా? అన్న సందేహాన్ని కలిగించేలా చేశాయి. ఇప్పటికే మంత్రిగారి ప్యారడైజ్ దెబ్బకు ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై కసరత్తు చేస్తున్న కమలనాథులకు.. మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువల్ ఓరం తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. తన సిబ్బంది చేత షూస్ మోయించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుది. రాయగడ జిల్లాలోని శివాలయం వద్ద తన దగ్గర పని చేసే స్టాఫ్ తో తన చెప్పుల్ని మోయించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఇదే మంత్రిగారు తన దగ్గర పని చేసే అసిస్టెంట్ మీద చేయి చేసుకోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా మాత్రం గుడికి వెళ్లి వస్తున్న మంత్రిగారి షూస్ ను పక్కన పెట్టేయటం.. దాన్ని ఆయన సిబ్బంది పట్టుకురావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఈ వీడియో ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మంత్రి ఓరంతో పాటు సీనియర్ నేతలు.. పార్టీ కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. అయితే.. సమావేశ మందిరానికి దగ్గర్లోనే శివాలయం ఉండటంతో.. దర్శనానికి వెళ్లారు.
గుడిలోకి వెళ్లే ఉందుకు షూస్ వదిలేసిన వారు.. దేవుడి దర్శనం అయ్యాక నేతలు తమ షూస్ వేసుకొని బయటలుదేరారు. ఆ క్రమంలో ఓరం మాత్రం ఆలయం నుంచి సమావేశ మందిరానికి ఉత్తకాళ్లతో నడుచుకుంటూ వెళ్లారు. దీంతో.. ఆయన దగ్గర పని చేసే స్టాఫ్ ఒకరు మంత్రిగారి షూస్ తీసుకొని పరుగున వచ్చారు. ఈ ఉదంతం కెమేరా కంటికి చిక్కటం.. అవి కాస్తా సోషల్ మీడియాలోకి వచ్చేయటంతో ఇష్యూ ఇప్పుడు పెద్దదైంది.