దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజుకు 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర మంత్రులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. పార్లమెంట్ సమావేశాల వేళ మరో మంత్రి కరోనా బారిన పడ్డారు.
మోదీ కేబినెట్‌లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్-19 మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద్ నాయక్ సహా పలువురు కేంద్రమంత్రులు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే.