తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు శనివారం లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎవరూ కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర మంత్రి సూచించారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ రెండో భేటి త్వరలోనే జరగాలని చెప్పారు.
నీటి వివాదాల గురించి కేంద్ర మంత్రి షెకావత్ లేఖలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని.. జలవివాదాలపై చర్చించడం కోసం అపెక్స్ కమిటీ భేటి అవ్వాలని సూచించారు. కృష్ణ, గోదావరి జలాలకు సంబంధించి ఈనెల 5న జరగాల్సిన భేటి వాయిదా పడిన నేపథ్యంలో షేకావత్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఇప్పటికే తెలంగాణలో పలు పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. అలాగే శ్రీశైలం ఎడమగట్టు వద్ద తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి షేకావత్ జోక్యం చేసుకొని అపెక్స్ కౌన్సిల్ భేటి జరగాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.