ఒకప్పుడు రాష్ట్ర మంత్రి అంటే ఆ గౌరవం.. మర్యాద వేరుగా ఉండేది. కొందరు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి సైతం ఒకింత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించేవారు. మారిన కాలానికి తగ్గట్లు.. ఒకప్పటిలా పవర్ ఫుల్ మంత్రులు ఇటు రాష్ట్రంలోనే కాదు అటు కేంద్రంలోనూ కనిపించని పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. కాస్తో కూస్తో తమ ఉనికిని చాటుకునే కేంద్ర మంత్రులు మోడీ సర్కారు ఒకరిద్దరు కంటే ఎక్కువగా లేని పరిస్థితి.
కేంద్రంతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్న పరిస్థితి. కేబినెట్ మీటింగ్ లోనూ నోరు విప్పి.. ఏదైనా విషయం మీద తమకున్న అభిప్రాయాల్ని బలంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రశ్నించటంతో పాటు.. సలహాలు.. సూచనలు చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటిది ఎక్కడా కనిపించటం లేదు. అంతవరకు ఎందుకు.. ముఖ్యమంత్రుల దర్శనం కూడా మంత్రులకు లేని పరిస్థితి.
అధినేత పిలిచినప్పుడు తప్పించి.. విడిగా తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు కలిసే అవకాశం లేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందన్న సంగతి తెలిసిందే. అధినేత చెప్పింది చెప్పినట్లు చేయటం.. ఆయన మనసెరిగినట్లుగా వ్యవహరించడమే ఇప్పటి మంత్రుల ప్రధమ కర్తవ్యంగా చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం మీద కత్తి దూసిన నేపథ్యంలో.. యాసంగి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వాదనను వినిపించేందుకు వీలుగా రాష్ట్ర మంత్రుల టీంను ఢిల్లీకి పంపిన సంగతి తెలిసిందే.
దీంతో.. కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు తమ బాస్ కేసీఆర్ అదే పనిగా గుర్తుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర వాదనను వినిపించేందుకు దేశ రాజధానికి వచ్చిన వారికి.. కేంద్ర మంత్రి పీయూష్ అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో.. ఆయన ఆఫీసును సంప్రదించిన వారు.. ఆయన టైం కోసం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఈ వెయిటింగ్ కొందరు మంత్రులకు చిరాకు తెప్పించినట్లు చెబుతున్నారు. ఒక రాష్ట్ర మంత్రుల టీం వస్తే.. ఇలా గంటల కొద్దీ ఎదురుచూసేలా చేయటమా? అంటూ విసుక్కున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. విసుగును టీంలోని కొందరు మంత్రులు తమదైన శైలిలో రియాక్టు అయినట్లుగా తెలుస్తోంది. వెయింటింగ్ మనకు అలవాటేగా.. అక్కడ బిగ్ బాస్ తో.. ఇక్కడ కేంద్ర మంత్రులతో.. మనుషులు మారారే తప్పించి.. తీరు మారింది లేదుగా? అన్న మాటలు మాట్లాడుకుంటున్నట్లుగా తెలిసిందే.
నిజానికి తాము ఢిల్లీకి రావటానికి ముందే తెలంగాణ రాష్ట్ర మంత్రుల టీం.. కేంద్ర మంత్రి పీయూష్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. ఇందుకోసం పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే.. నామా నాగేశ్వరరావు.. పీయూష్ గోయల్ కలిశారు. ఆయనకు తమ రాష్ట్ర మంత్రులు అపాయింట్ మెంట్ కావాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన.. ఇప్పటికే తన షెడ్యూల్ ఖరారై ఉందని.. అందుకే గురువారం కలుస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా.. పీయూష్ ను కలవటానికి వచ్చిన టీ మంత్రులు.. కేంద్ర మంత్రి ఆఫీసు నుంచి వచ్చే సమాచారం కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించినట్లుగా చెబుతున్నారు. చివరకు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అపాయింట్ మెంట్ ఇస్తూ కేంద్ర మంత్రి పీయూష్ ఆఫీసు నుంచి సమాచారం వచ్చింది. దీంతో.. గంటల కొద్దీ వెయిటింగ్ పీరియడ్ ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పీయూష్ తీరుతో తమ బాస్ ను గుర్తుకు వచ్చేలా చేశారన్న వ్యాఖ్య పలువురి నోటి వినిపించటం గమనార్హం.