వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 22 ఏళ్ల సుధీర్ఘ కెరియర్ కు స్వస్తి పలికాడు. ప్రపంచకప్ టీ20 చివరి మ్యాచ్ సందర్భంగా తన రిటైర్ మెంట్ ను ప్రకటించాడు. అబుదాబిలో ఆస్ట్రేలియాతో తన చివరి టీ20 మ్యాచ్ ఆడిన అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తూ రిటైర్ మెంట్ చేశాడు.
1999లో భారత్ పై మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి క్రిస్ గేల్ అడుగుపెట్టాడు. వెస్టిండీస్ జట్టుకు 22 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సుడిగాలి బ్యాటింగ్ ఇన్నింగ్స్ లతో గేల్ టీ20 క్రికెట్ కు వన్నె తెచ్చాడు. టీ20 క్రికెటర్ గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్ లలో ఆడుతూ తన చిత్రమైన బాడీ లాంగ్వేజ్ కామెడీ టైమింగ్ తో ఈ లెజెండ్ ఎన్నో వేల పరుగులు చేసి రికార్డులు నెలకొల్పి ‘యూనివర్స్ బాస్’గా పేరు తెచ్చుకున్నాడు. అతడి గణాంకాలు చూస్తే ఇప్పటికీ ఏ వెస్డిండీయన్ సాధించలేకపోయాడు.
టీ20 క్రికెట్‌లో గేల్ 445 ఇన్నింగ్స్‌లు ఆడి 22 సెంచరీలతో సహా 14,321 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పుణె వారియర్స్‌పై 175 పరుగులు చేయడం అతని అత్యధిక స్కోరు. ప్రస్తుతానికి ఏ అంతర్జాతీయ క్రికెటర్‌కైనా అత్యుత్తమ టీ20 సెంచరీలు, 1043 సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ రికార్డు సృష్టించాడు.
క్రిస్ గేల్ 2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2012 మరియు 2016లో T20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అయితే ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో గేల్ ఏ మ్యాచ్‌లోనూ తన సత్తాకు తగ్గట్టు బ్యాటింగ్ చేయక నిరాశపరిచాడు. ఏది ఏమైనప్పటికీ, గేల్ తన అద్భుతమైన హిట్‌లకు.. ముఖ్యంగా అతని వైఖరికి అతనికి భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. గేల్ ఎప్పటికీ క్రికెట్ లో ఒక విలక్షణ క్రీడాకారుడిగా గుర్తుండిపోతాడు. అందుకే అతడిని అందరూ యూనివర్స్ బాస్ గా పిలుస్తారు.
ఇక క్రిస్ గేల్ తోపాటు ఎంట్రీ ఇచ్చిన మరో దిగ్గజ క్రికెటర్ డీజే బ్రావో కూడా నిన్ననే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతడు కూడా గేల్ తోపాటు మ్యాచ్ అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ రిటైర్ మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున డీజే బ్రావో ఐపీఎల్ లో ఆడుతున్నాడు.