అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇది. అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ఓ పక్క ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా.. అందుకు పూర్తి విరుద్ధంగా ఓ అమెరికా విశ్వవిద్యాలయం మాత్రం ఉన్న ఉద్యోగులను తొలగించి వారి పనిని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 49 మంది కొలువుల ఊడబీకేసి అదే పనిని అవుట్ సోర్సింగ్ కు అందించింది. అమెరికాలోని కాలిఫోర్నియా - శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం 49మంది కంప్యూటర్ ఉద్యోగులను తొలగించింది. వారు చేసే పనిని ఒక భారతీయ కంపెనీకి అప్పజెప్పింది. ఈ విశ్వవిద్యాలయం ఐదేళ్లలో 30మిలియన్ డాలర్లను పొదుపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఖర్చును తగ్గించేందుకు వీరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది.
ఇంత మంది ఉద్యోగులను తీసేయడం - అది కూడా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తొలగించడంపై విశ్వవిద్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ వ్యయ నియంత్రణ కోసం 49 మందిని ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. వీటితోపాటు ఖాళీగా ఉన్న మరో 48 పోస్టుల్లో కూడా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు. దీనిపై కాలిఫోర్నియా సెనెటర్ డెన్నీ ఫెయిన్సెటెన్ మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయంపై కూడా ఉందని అన్నారు. దేశీయ ఉద్యోగాలు కూడా అవుట్ సోర్సింగ్ కు వెళ్లకుండా ఉండేలా విశ్వవిద్యాలయం కట్టుబడి ఉండాలన్నారు. గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం హెచ్ సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఐదేళ్ల ఒప్పందం చేసుకుంది.
కాగా, ప్రస్తుతం అమెరికాలో ఔట్ సోర్సింగ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. చాలా సంస్థల యాజమాన్యాలు వ్యయ నియంత్రణలో భాగంగా ఔట్ సోర్సింగ్ వైపు మొగ్గుతున్నాయి. మరోపక్క దేశాధ్యక్షుడు ట్రంప్ మాత్రం అమెరికన్లకే ఉద్యోగాలు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/