అన్ లాక్ 5 : కంటైన్మెంట్ జోన్లలో పాటించాల్సిన మార్గదర్శకాలివే!

Update: 2020-10-08 04:30 GMT
రాష్ట్రంలో  కంటైన్మెంట్ జోన్లలో పాటించాల్సిన అన్ లాక్ 5 నిబంధనలపై  తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో  అక్టోబరు 31వ తేదీ వరకు  కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులోని వివరాలివే..

కాలేజీలు, ఉన్నత విద్య సంస్థలు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలి.  పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, పార్కులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం రానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి డి స్కాలర్, ల్యాబ్ పీజీ కోర్సులను అందిస్తున్న ఉన్నత విద్యా సంస్థలను ప్రారంభించుకోవచ్చు.  

క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్మిమ్మింగ్ ఫూల్స్ తెరుచుకోవచ్చు..అయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కరోనా నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందితో కూడిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మాస్కుల ధారణ , థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం తప్పనిసరి. వివాహం,అంత్యక్రియల వంటి కార్యక్రమాలకు 100 మంది వరకూ హాజరుకావొచ్చు. ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది పాల్గొనాల్సి ఉంటే కలెక్టర్, స్థానిక పోలీసులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతి తీసుకోవచ్చు. టూ బీ ఎగ్జిబిషన్లను రన్ చేసుకోవచ్చు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండాలి. ప్రభుత్వం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
Tags:    

Similar News