నిందారోపణలు చేయడం ద్వారా భారతదేశాన్ని ఇరకాటంలో పడేయాలని భావించిన పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన `అతి`తో అంతర్జాతీయ అత్యున్నత వేదిక అయిన ఐక్యరాజ్యసమితి నుంచి పాకిస్తాన్ పరోక్షంగా మొట్టికాయలు వేయించుకుంది. వాస్తవాధినరేఖ నుంచి ఐక్యరాజ్యసమితి పరిశీలన బృందం వాహనంలో వెళుతుండగా దానిపై భారత ఆర్మీ కాల్పులు జరిపిందంటూ పాకిస్తాన్ ఆరోపించింది. దీనికి ఐరాస ఘాటు కౌంటర్ ఇచ్చింది. భారత్ విషయంలో పాక్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసింది.
వాస్తవాధీన రేఖ వద్దనున్న ఖంజర్ సెక్టార్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలన బృందం పర్యటిస్తుండగా భారత సైనికులు కాల్పులు జరిపారనే విషయాన్ని పాక్ సైనిక అధికారులు తమకు వెళ్లడించినట్లు ఆ దేశ పత్రికలు తెలిపాయి. ఈ సందర్భాన్ని ఉదహరిస్తూ పాక్ ఆర్మీ గగ్గోలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత ఆర్మీ ఉల్లంఘించిందని, ఏకంగా ఐరాస ప్రతినిధుల సమక్షంలోనే ఇది రుజువు అయిందని విమర్శలు చేసింది. అయితే దీన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి కొట్టిపారేశారు. ఖంజర్ సెక్టార్ లో జరిగిన కాల్పుల్లో ఐరాస సిబ్బంది ఎవరూ గాయపడలేదని, ఇది ఐరాస బృందం లక్ష్యంగా జరిగిన కాల్పులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. సైనిక పరిశీలక బృందం వాహనం పాక్ సైన్యం ఎస్కార్ట్ తో వెళుతుండగా దూరంగా కాల్పుల శబ్దం వినిపించినందున తమను ఉద్దేశించే జరిపినట్లుగా భావించడం సరికాదని పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/