హిందూపురం పోరులో అన్ స్టాప‌బుల్ బాల‌య్య ! ట‌చ్ చేసి చూడు !

Update: 2022-02-05 12:30 GMT
అనంత రాజ‌కీయాల్లో అమితోత్సాహంతో బాల‌య్య క‌దం తొక్కుతున్న తీరు టీడీపీని ఆనందింప‌జేస్తుంది.ఎన్న‌డూ లేని విధంగా బాల‌య్య రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ధాన పార్టీల దృష్టిని కేంద్రీక‌రించేలా చేస్తోంది.ఈ క్ర‌మంలో హిందూపురం జిల్లా సాధ‌న అన్న‌ది బాల‌య్య ఎంచుకున్న ఏకైక అజెండా! సాధిస్తారా? స్వ‌ప్నానికే ప‌రిమితం చేస్తారా? ఇవాళ ఆయ‌న మౌన దీక్ష చేప‌ట్టి,అనంత‌పురం క‌లెక్ట‌ర్ ను క‌లిసి విన‌తి ఇచ్చి వ‌చ్చారు. డిమాండ్ వెనుక ఉన్న కార‌ణాల‌న్నింటినీ విశ‌దీక‌రించారు.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తూ ఆ ప్రాంత ఎమ్మెల్యే బాల‌య్య అలుపెరుగ‌క పోరాటం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన స‌త్య సాయి జిల్లా అన్న‌ది ఇక్క‌డి ప్ర‌జా భీష్టంకు వ్య‌తిరేకంగా ఉంద‌ని పేర్కొంటూ ఆయ‌న ఉద్ధృత రూపంలో ఉద్య‌మిస్తున్నారు.ప్ర‌తిపాదిత స‌త్య‌సాయి జిల్లాలో పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రంగా కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.దీంతో ఆ ప్రాంత ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా నిన్న‌టి వేళ భారీ ర్యాలీ నిర్వ‌హించారు.ఇవాళ మౌన దీక్ష‌ను ప్రారంభించారు. హిందూపురం పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హం ద‌గ్గ‌ర నుంచి బీఆర్ అంబేద్క‌ర్ కూడ‌లి వ‌ర‌కూ ర్యాలీ తీసి, అనంత‌రం ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడారు. అవస‌రం అయితే పుట్ట‌ప‌ర్తి వెళ్లి మ‌రీ! ఆందోళ‌న‌లు చేస్తామ‌ని అంటున్నారాయన. న‌చ్చిందే చేస్తాం ఎవ‌రు ఆపుతారో చూస్తాం అన్న నినాదాన్ని కూడా వినిపించారు. ఇవాళ కూడా బాల‌య్య మౌన దీక్ష‌ను చేప‌ట్టి అనంత‌రం వామ ప‌క్షాల‌తో క‌లిసి భారీ ఎత్తున ప్ర‌ద‌ర్శ‌న‌గా క‌లెక్ట‌రేట్ కు చేరుకుని సంబంధిత జిల్లా ప‌రిపాల‌నాధికారికి మెమొరాండం ఇచ్చారు.హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌ని,ఈ విష‌య‌మై సీఎంను క‌లిసేందుకు కూడా తాను సిద్ధ‌మేన‌ని అన్నారు.

రాజీనామా మాట ఏమైంది?

నిన్న‌టి వేళ హిందూపురం జిల్లా సాధ‌న‌కు అవ‌స‌రం అయితే ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేస్తాన‌ని బాల‌య్య ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. కానీ ఇప్పుడు అదే మాట మ‌రోసారి వినిపించ‌లేదు. ఒక‌వేళ బాలయ్య త‌న మాట ప్ర‌కారం రాజీనామా చేస్తే రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాలు తీవ్రంగా మారిపోతాయి. అదేవిధంగా టీడీపీలోనూ పెను మార్పులు వ‌స్తాయి. అధికార పార్టీ నుంచి  కూడా హిందూపురం జిల్లా సాధ‌న‌పై మంచి రెస్పాన్సే వ‌స్తుంద‌ని, ఈ క్రెడిట్ బాల‌య్య‌కు ద‌క్క‌క ముందే జిల్లాను అనౌన్స్ చేయాలని ఇంకొంద‌రు వైసీపీ వ‌ర్గీయులు అంటున్నారు. క్రెడిట్ ఎవ్వ‌రిది అయినా త‌మ హీరో క్రేజ్ మాత్రం త‌గ్గ‌దని నంద‌మూరి అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.అటు రాజ‌కీయంలోనూ ఇటు సినిమారంగంలోనూ వీటితో పాటు అన్ స్టాప‌బుల్ అంటూ ఓటీటీ ప్లాట్ ఫాంపైనా బాల‌య్య అజేయ ప్ర‌స్థానం సాగిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ  లేని విధంగా దూసుకుపోతున్నారు. ఇవాళ్టి నిర‌స‌న అనంత‌రం త‌రువాత కార్యాచ‌ర‌ణ ఏంట‌న్న‌ది ఇంకా తెలియ‌కున్నా పోరు బాట మాత్రం వీడ‌ర‌ని బాల‌య్య అభిమాన వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News