దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృభించడానికి ప్రధాన కారణం ..ఢిల్లీ మర్కజ్ ఘటనే. దేశంలో కరోనా తాండవం చేస్తున్న సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై యూపీ సీఎం యోగి స్పందించారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. శనివారం జరిగిన ‘ఈ ఎజెండా ఆజ్‌తక్’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ తబ్లిగీ జమాత్ చేసిన పనిని ఖండిస్తున్నా. తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండిఉంటే లాక్ డౌన్ మొదటి దశలోనే కరోనాను కట్టడి చేసేవాళ్లం. తబ్లిగీ జమాత్ చేసింది నేరం.. సభ్యులు కచ్చితంగా శిక్షింపబడాలి. రాష్ట్రంలో దాదాపు 3,000 మంది తబ్లిగీ జమాత్ సదస్సుతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. రోగం తెచ్చుకోవటం నేరం కాదు. కానీ, దాన్ని దాచిపెట్టడం కచ్చితంగా నేరమే. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటా’’మని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 2,328మంది కరోనా వైరస్ బారినపడగా, 654మంది కోలుకున్నారు. దాదాపు 42మంది మృత్యువాత పడ్డారు.