ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు వాటికీ అనుమతిలేదు!

Update: 2020-04-25 12:54 GMT
కరోనా మహమ్మారినీ కట్టడి చేయాలంటే గుంపులు , గుంపులుగా బయటకి రాకూడదు. శుభ్రత పాటించాలి, మాస్కులు తప్పనిసరిగా కట్టుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యంగా జనాలంతా ఒకేచోట గుంపుగా ఉంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదుకే సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం మొత్తుకొని చెప్తుంది. అయినా కూడా కొంతమంది లాక్ డౌన్ నియమాలని పాటించడంలేదు. ఇకపోతే దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, బాధితులకు అందుతున్న వైద్యసహాయాలపై, పెరుగుతున్న కేసుల నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగానే అధికారులు, వైద్య సిబ్బంది సూచనల మేరకు జూన్‌ 30 వరకు సభలూ, సమావేశాలపై నిషేధం విధించారు.

వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు. మే3న లాక్ఎ డౌన్ ను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో వున్న వలస కూలీలు రాష్ట్రంలోకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సీఎం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News