సూటిగా సమాధానం చెప్పాలని కోరుకోనప్పుడు సమాధానాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంంది. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా వివాదం కానంత భారీగా పద్మావతి అలియాస్ పద్మావత్ మూవీ వివాదమమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే.. ఈ సినిమా విడుదల మీద బ్యాన్ విధించాయి. అలాంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఇదిలాఉంటే.. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ మధ్యనే సినిమా పేరుతో పాటు ఆందోళన చేస్తున్న వారు సూచించిన మార్పుల్ని కొన్నింటిని మార్చేశారు.
దీంతో పలువురు తమ అభ్యంతరం తీరినట్లుగా ఫీల్ అయితే.. మరికొందరు మాత్రమే రిలీజ్‌కు ససేమిరా అంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ చిత్ర విడుదలపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఇలాంటి వేళ.. యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ను ఈ సినిమా విడుదల మీద విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అని చెప్పటానికి తాను జ్యోతిష్యుడిని కాదనేశారు.
ఉత్తరప్రదేశ్‌లో సినిమా విడుదల అవుతుందా? లేదా అన్నది చెప్పటానికి తాను జ్యోతిష్యుడ్నికాదని చిరాకు పడిపోయారు. అక్కడితో ఆగని ఆయన తన మనసులోని మాటను చెబుతూ.. కర్ణిసేన సంఘాలు చిత్ర బృందాన్ని బెదిరిస్తున్నాయి.. వారిలా చేయటం తప్పేనని.. అదే సమయంలో భన్సాలీ చేసింది కూడా తప్పేనని తేల్చారు.
చట్టాన్ని చేతల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. భారీ చర్చ జరుగుతున్న ఒక సినిమా రిలీజ్ తాను పాలిస్తున్న రాష్ట్రంలో రిలీజ్ అవుతుంందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం సీఎంకు కాకుండా జ్యతిష్యుడికి తెలుస్తుందని చెప్పటంతోనే ముఖ్యమంత్రిని ఎంతలా ఇరిటేట్ చేస్తుందో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.