కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది, మన దేశంలో కూడా కరోనా మహమ్మారీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది. అయితే , కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తుంటే ,-కొంతమంది మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారు. ఆలా బయటకి వచ్చే వారికి పోలీసులు కొత్త శిక్ష విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కి బయటకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేయకుండా ఉండాలంటే మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసి అది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్నారు. అలాగే తనలాగే లాక్ డౌన్ నియమాలని తుంగలో తొక్కి బయటకు వచ్చిన ముగ్గురిని ఆపి .. వారి చేత కూడా ఇలానే చేయించాలని చెబుతున్నారు. ఈ సరికొత్త కొత్త శిక్షను యూపీ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. ఈ మొత్తాన్ని రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేశంలో కరోనా కట్టడి కోసమని లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అలాగే ఈ సమయంలో పోలీసులు - వైద్యలు - అధికారులు తమ కుటుంబాలని వదిలిపెట్టి - అలాగే తమ ప్రాణాలని పనంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటే ..కొంతమంది ఆకతాయిల ఇంట్లో కూర్చొని తిని ఉండలేక రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు - ప్రభుత్వాలు ఎన్ని సార్లు చెప్తున్నా కూడా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇకపోతే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 17265 మందికి కరోనా సోకగా ..543 మంది కరోనా తో మృతి చెందారు.