తొలిసారి పోలీసుల తిరుగుబాటు..

Update: 2018-10-05 10:46 GMT
ఓ కేసు విషయంలో యూపీలో జరుగుతున్న ఘటన ఇప్పడు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు ఆందోళనకు దిగడం వివాదాస్పదంగా మారింది. ఈ   ప్రభావం ప్రభుత్వం పైనా పడింది.  గత వారం ఆపిల్ సంస్థ ఉద్యోగి వివేక్ తివారిపై కాల్పులు జరిపిన కేసులో ప్రశాంత్ చౌదరి అనే పోలీస్ ఉద్యోగి అరెస్టయ్యాడు.  అతడిని విధుల్లో తిరిగి చేర్చుకోవాలంటూ తోటి పోలీసులు నిరసన తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే జరుపుతున్నారు.

అసలేం జరిగిందంటే - యాపిల్ సంస్థలో పనిచేసే వివేక్ తివారి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆపమని కోరినా ఆపకపోవడంతో కోపోద్రిక్తుడైన పోలీస్  ప్రశాంత్ చౌదరి కాల్పులు జరిపాడు. తివారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద దుమారమే రేపుతుంది.

తన భర్తను పోలీసులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మృతుడి భార్య కల్పనా తివారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కారు ఆపకపోతే చంపేస్తారా అంటూ కడిగిపారేస్తుంది. మరో వైపు ఆత్మ రక్షణ కోసమే కాల్పులు  జరిపామంటూ పోలీసులు చెబుతున్న మాటలు అంత నమ్మశక్యంగా లేవని అంటోంది.

దీనిపై సీరియస్ అయిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కాల్పులు జరిపిన పోలీస్ ప్రశాంత్ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించి - దర్యాప్తునకు సిట్ ను నియమిస్తున్నట్లు ఆదేశించారు.

తాజాగా ఈ ఘటనపై పోలీసులు కూడా ఆందోళనకు దిగారు. తోటి ఉద్యోగికి అండగా నిలవాలని ఫేస్ బుక్ లో వీర్ సింగ్ రాజు అనే వ్యక్తి అకౌంట్ ను ప్రారంభించాడు. సీనియర్ అధికారులు ఎవరూ అండగా నిలవడం లేదని, తోటి ఉద్యోగులంతా కలిసి న్యాయం జరిగే వరకు పోరాడదామని పిలుపునిచ్చాడు. అనుకున్నట్టే భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ప్రశాంత్ భూషన్ భార్య అకౌంట్లో రాత్రికి రాత్రే రూ.5లక్షల వరకు జమయ్యాయి. ఇప్పడు ఆ ఫేస్ బుక్ ఖాతా వైరల్ గా మారింది. ఎలాగైనా ప్రశాంత్ చౌధరిని ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే దీక్షను విరమిస్తామని హెచ్చరిస్తున్నారు. బ్లాక్ బ్యాడ్జీతో విధులకు హాజరవుతున్న పోలీసులు - శుక్రవారం బ్లాక్ డేగా పేర్కొంటూ నిరసన తెలిపారు.  చినికి చినికి గాలివానగా మారిన ఈ సంఘటన యూపీ రాజకీయాలను కుదిపేస్తుంది.
Tags:    

Similar News