ఇద్దరు కొత్త వ్యక్తులు కలిసి తప్పనిసరిగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొన్ని అంశాల మీద మాట్లాడుకోవటం మామూలే. అయితే.. ఆ చర్చ పెళ్లిని పెటాకులు అయ్యేలా చేస్తుందంటే షాకింగే. సినిమాల్లో కనిపించే సీన్ లాంటిదే ఒకటి రియల్ గా జరిగింది. కాన్పూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికర వార్తగా మారింది. ఎందుకింత ఆసక్తి అంటే.. పెళ్లి అగిపోయింది ప్రధాని మోడీ కారణం కావటమే. ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని కారణంగా పెళ్లి చెడిపోవటం ఏమిటన్న డౌట్ వచ్చిందా? ఉండండి.. ఈ ఇష్యూ గురించి డీటైల్డ్ గా చెబితే ఇట్టే అర్థమవుతుంది.
కాన్పూరుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కు జాబ్ చేస్తున్న ఒక అమ్మాయితో పెళ్లి సెట్ అయ్యింది. ఇరు పక్షాల పెద్దలు.. పెళ్లి వేడుకను ఎలా నిర్వహించాలి? ఎప్పుడు నిర్వహించాలి? లాంటి వాటిని మాట్లాడుకోవటం కోసం ఒకగుళ్లో కలిశారు. పెళ్లి పెద్దలతో పాటు.. పెళ్లికొడుకు.. పెళ్లికూతురు కూడా హాజరయ్యారు. అంతా కొత్త కావటంతో ఇరు వర్గాల మధ్య కొత్తదనం పోవటానికి మాట కలిపారు. అది కాస్తా ప్రధాని మోడీ వరకూ వెళ్లి.. ఆయన మీద మాట్లాడుకోవటం మొదలెట్టారు.
మోడీ హయాంలో దేశంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని.. పేదల పరిస్థితి ఏమీ మారలేదంటూ పెళ్లికూతురు నిష్ఠూరం ఆడింది. దీనికి పెళ్లికొడుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మోడీ హయాంలో దేశం రూపురేఖలే మారిపోయినట్లుగా చర్చ సాగింది. దీంతో.. వారి మధ్య మాటలు పెద్ద చర్చగా మారి చివరకు రచ్చ రచ్చ అయ్యే వరకూ వెళ్లింది. వాగ్వాదంగా మారటంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నచ్చకపోవటం.. పెళ్లికూతురు పెళ్లి కొడుక్కి నచ్చకపోవటంతో.. నీతో పెళ్లా? అంటూ ఎవరికి వారు కటీఫ్ అంటే కటీఫ్ అనుకునే పరిస్థితి. అభిప్రాయాలు కలవని వాళ్లం.. జీవితాంతం ఎలా కలిసి ఉంటామంటూ పెళ్లి.. గిళ్లి క్యాన్సిల్ అనేసుకున్నారు. సినిమాటిక్ గా జరిగిన ఈ వ్యవహారంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక రెండు పక్షాలకు చెందిన పెళ్లి పెద్దలు నోరు వెళ్లబెట్టే పరిస్థితి. మోడీ గురించిన చర్చతో ఇలాంటివి కూడా జరుగుతాయా..?