ఉత్తరప్రదేశ్ పోలీసులతో అక్కడి రాజకీయ నేతలు ఆడుకుంటున్నారు. వారి ఇళ్లలో ఏం పోయినా పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. మొన్నటికి మొన్న సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ గేదెలు తప్పిపోతే యూపీ పోలీసులు వాటి కోసం ఊరూరూ వెతికి పట్టుకున్నారు. తాజాగా అలాంటి సీనే ఇంకోటి వచ్చింది.
రాంపూర్ జిల్లాలో మొహల్లా బంగ్లాకు చెందిన ఎస్పీ లీడర్ ఫర్హానుల్లాకు చెందిన 12 కోళ్లు కనిపించడం మానేశాయట. ఎవరైనా ఎత్తుకెళ్లారో.. అవే తప్పించుకుని పారిపోయాయో... లేకుంటే నక్కలు ఎత్తుకెళ్లాయో తెలియవు కానీ వాటిని వెతికి తెచ్చే బాధ్యతను పోలీసులకు అప్పగించారు. పాపం ఎంత ప్రయత్నించినా అవి వారికి దొరకలేదు.. దీంతో ఫర్హానుల్లా ఏకంగా గవర్నరుకు ఫిర్యాదు చేశారట... తన కోళ్లను వెతికి పట్టుకోవడంతో పోలీసులు విఫలమయ్యారని... వారు చిత్త శుద్దితో పనిచేయడంలేదని కంప్లయింటు చేశారట. పాపం ఇంకేముంది... పోలీసులు దీనిపై సమావేశం ఏర్పాటు చేసుకుని... ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఆయనగారి కోళ్లను ఎలాగైనా వెతికి పట్టుకుంటామని చెప్పారు.