యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించడం కారణం కావచ్చు లేదంటే విద్యా వ్యవస్థను చక్కదిద్దే నిర్ణయం అయి ఉండవచ్చు కానీ యూపీలో ఓ అనూహ్యమైన నిర్ణయం వెలువడింది. ఉపాధ్యాయులు ఇకపై జీన్సు, టీషర్టు ధరించి పాఠశాలలకు రావద్దని లక్నో డిస్ట్రిక్ట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐవోఎస్) ఉమేశ్ త్రిపాఠి ఆదేశించారు. తన ఆదేశాలకు గల కారణాలను ఆయన వివరిస్తూ...వృత్తి గౌరవం పెంచేలా ఉపాధ్యాయుల వస్త్రధారణ ఉండాలని, అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో కూడా చర్చిస్తానని తెలిపారు.
దీంతో పాటుగా మరో ఆదేశాలను సైతం లక్నో జిల్లా విద్యాధికారి విడుదల చేశారు. పాఠశాలల పనివేళల్లో మొబైల్ ఫోన్స్ వినియోగించడం మంచిది కాదని అన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని.. అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థనలు జరిగేలా చూడాలని ఆదేశించారు. తాజాగా సీఎం ఆదిత్యనాథ్ ఇచ్చిన ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ - సిగరేట్ల వాడకం ఆదేశాలను సైతం స్కూళ్లకు వర్తింపచేశారు. పాఠశాలలకు సమీపంలో పాన్ మసాలా.. సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా... గత ఏడాది హర్యాన ప్రభుత్వం, ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దని కోరిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/