కరోనా కల్లోలంతో పరిస్థితులు చేయిదాటి పోతున్న వేళ యూపీలోని యోగి ఆధిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది.
ఆక్సిజన్ కొనాలనుకునే వారు తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సమర్పించాలని తెలిపింది. ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఇన్ఫర్మేషన్) నవనీత్ సెహగల్ తాజాగా మాట్లాడారు.. ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుకోవడాన్ని నిరోధించే లక్ష్యంతో అమ్మకాలకు కొన్ని నిబంధనలు విధించినట్లు తెలిపారు.
ఇక నుంచి యూపీలో ఆక్సిన్ కొనాలనుకునే వారు.. సిలిండర్లను ఆక్సిజన్ తో నింపుకోవాలనుకునే వారు తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను సమర్పించాలని తెలిపారు. అది ఉంటే ఆక్సిజన్ అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు.