ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ నేతలపై పట్టుతప్పుతోందా? మోడీజీ ఒకటి చెప్తే..పార్టీ నేతలు అందులోనూ మంత్రుల హోదాలో ఉన్నవాళ్లు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ఏంటి? ఇది ఇప్పుడు పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ. అది కూడా బీజేపీ తురుపు ముక్క అని భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలో చోటుచేసుకుంటున్న కలకలం. దేశవ్యాప్తంగా దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీపై ముద్ర పడుతున్న సమయంలో ప్రధాని మోడీ వాళ్ల పార్టీ నేతలకు ఓ పిలుపునిచ్చారు. సీఎంలు - డిప్యూటీ సీఎంలు - మంత్రులు - ఎమ్మెల్యేలు - ఇతర నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి, వాళ్లతో మమేకమవ్వాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. యూపీలోని బీజేపీ మంత్రులు చేస్తున్న పనులు ఆ పార్టీ పరువు తీస్తున్నాయి.
పార్టీ పట్ల దళితుల్లో మరింత వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు మోడీ ఈ కొత్త ఎత్తుగడను అమల్లో పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2019 ఎన్నికలకు ముందు దళితులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన టీంలోని మంత్రులు చేస్తున్న పనులు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. తాజాగా చోటుచేసుకున్న రెండు సంఘటనలను ఉదహరిస్తున్నారు. అలీగఢ్‌లోని లోహగఢ్‌లో సడెన్‌గా ఓ దళితుడి ఇంటికి సురేశ్ రానా అనే ఓ మంత్రివెళ్లి భోజనం చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యారు. ఆ దళితుని ఇంటికి వెళ్లక ముందే ఆ ఊళ్లో కేటరింగ్ చేసే వ్యక్తి దగ్గర అన్ని వంటకాలు వండించుకొని తీసుకెళ్లారు. తందూరీ రోటీలు - పన్నీర్ - పులావ్ - గులాబ్ జామూన్.. ఇలా అన్ని వంటకాలు తీసుకెళ్లి ఆ దళితుని ఇంట్లో కూర్చొని తిని వచ్చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో యోగి తల పట్టుకున్నారు. ఏదో రకంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు.
మరో మంత్రి తన కామెంట్లతో బుక్ అయ్యారు. రాజేంద్ర ప్రతాప్ సింగ్ అనే మంత్రి అయితే తనకు తాను దేవుడిలా ఫీలయ్యారు.ఝాన్సీ జిల్లా గధ్ మౌ గ్రామంలో ఓ దళితుడి ఇంటికి వెళ్లే ముందు ఆయన కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. `ఆ రాముడు శబరి ఇచ్చిన రేగుపళ్లను తిని ఆమెను ఆశీర్వదించినట్లే.. బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తున్నారు` అని ఆయన అన్నారు. `నేనో క్షత్రియున్ని. సమాజం - మత రక్షణ కోసం పనిచేయడం నా రక్తంలోనే ఉంది. మేం వాళ్ల ఇళ్లకు వెళ్తుంటే ఈ దళితుల ముఖాల్లో ఎంత ఆనందం కనిపిస్తున్నదో చూడండి` అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఒకటి చేయబోతే..ఇంకొకటి జరిగిందని చర్చించుకోవడం కనిపిస్తోంది.