2022 ఏడాదిలోనే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబవరి 10 నుంచి యూపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని 125 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ప్రకటించింది. మీరట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా ఇద్దరి పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. వీరిలో కిథోర్ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ బబితా సింగ్ గుర్జార్ పోటీ చేయనున్నారు. ఆయన కాంగ్రెస్ లో గత కొన్నాళ్లుగా యాక్టివ్ గా పని చేస్తున్నారు.
అలాగే హస్తినాపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రముఖ నటి, మోడల్ అర్చన గౌతమ్ పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈమేరకు అర్చన గౌతమ్ పేరును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖరారు చేశారు. తనకు హస్తినాపూర్ అసెంబ్లీ సీటు కేటాయించడంపై అర్చన గౌతమ్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే బికినీ భామ అర్చనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అర్చన గౌతమ్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జన్మించారు. మోడల్, నటిగా కంటే కూడా అర్చన గౌతమ్ బికినీ భామగా ఫేమస్ అయ్యారు. మిస్ బికినీ ఇండియా-2018 కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచారు. మిస్ ఉత్తరప్రదేశ్-2014, మిస్ కాస్మో ఇండియా-2018 టైటిల్స్ ను గెలుచుకున్నారు. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
హిందీలో ‘గ్రేట్ గాండ్ మాస్త’, ‘హసీనా పార్కర్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే సౌత్ ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో కన్పించి అభిమానులను అలరించారు. 26ఏళ్ల ఈ భామ కిందటేడాది నవంబర్లో ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘెల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రియాంకా గాంధీ చేపడుతున్న ‘గర్ల్ హున్, లడ్ సక్తి హూన్’ కార్యక్రమానికి ఆకర్షితురాలై కాంగ్రెస్ లో చేరినట్లు అర్చన తెలిపారు.
యూపీలో ఎన్నికల్లో మహిళలకు 50శాతం టికెట్లు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ ముందుగానే స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటిన పలువురు మహిళలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయిస్తోంది. ఈక్రమంలోనే అర్చన గౌతమ్ కు హస్తినపూర్ అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ ఖరారు చేసింది. దీంతో ఈ స్థానాన్ని బికినీ భామ నిలబెట్టుకుందో లేదో అన్న ఆసక్తికరమైన చర్చ అభిమానుల్లో నడుస్తోంది.