దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి పలు పార్టీలుతమ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయటం స్టార్ట్ చేశాయి. ఈ సారి ఎన్నికల్లో భారీ ప్రయోజనాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన తీరుకు భిన్నంగా నెలల ముందే తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయటమే కాదు.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని సైతం డిసైడ్ చేసేసింది. ఇప్పుడిప్పుడే మిగిలిన రాజకీయ పక్షాలు సైతం ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకు సమాయుత్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. యూపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తికి తగ్గట్లే తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. పార్లమెంటేరియన్ పత్రిక సర్వే ప్రకారం యూపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడనున్నట్లుగా సదరు సర్వే వెల్లడించింది. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదని తేల్చారు. సదరు సర్వే ప్రకారం ఎస్పీ 150 సీట్ల మేర కోల్పోనుందని చెబుతున్నారు. ఈ 150 సీట్లను బీఎస్పీ.. బీజేపీలు సమానంగా పంచుకోనున్నట్లు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో విపక్ష బీఎస్పీ అత్యధిక స్థానాల్ని చేజిక్కించుకున్న పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితం తేల్చింది. ఇప్పుడున్నసీట్లకు అదనంగా బీఎస్పీకి 89 సీట్లు లభిస్తాయని.. అదే సమయంలో ప్రస్తుతం 47 అసెంబ్లీస్థానాలు ఉన్న బీజేపీకి 88 సీట్లు సొంతం చేసుకోనున్నట్లు చెప్పారు. అదే సమయంలో.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బ పడనున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు 28 సీట్లు ఉండగా అవి కాస్తా13కు తగ్గనున్నట్లుగా అంచనా వేశారు. యూపీ ఎన్నికల్లో తమకు తిరుగులేదనుకుంటున్న బీజేపీ.. ఎస్పీలకు తాజా సర్వే ఫలితాలు షాకింగ్ గా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.