'లూడోలో త‌న‌ను తాను పందెంకాసి ఓడిపోయి...అత‌డికి లొంగిపోయిన లేడీ!

Update: 2022-12-05 14:30 GMT
జూదంలో త‌న భార్య‌ను ప‌ణంగా పెట్టి ఓట‌మి పాలైన ధ‌ర్మ‌రాజును మ‌హా భార‌తంలో చూశాం. కానీ ఒక భార్య జూదంలో త‌న‌ను తాను ప‌ణంగా పెట్టుకుని ఓడిపోయి మ‌రో వ్య‌క్తికి లొంగిపోయిన సంఘ‌ట‌న ఆధునిక భార‌తంలో చోటు చేసుకుంది.  ఆమె భ‌ర్త ఇర‌త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసి భార్య‌కు డ‌బ్బులు పంపేవాడు. ఆమె ఆ డ‌బ్బుతో తాను అద్దెకుంటున్న ఇంటి య‌జ‌మానితో లూడో గేమ్ జూదం ఆడేది. భ‌ర్త పంపిన డ‌బ్బుల‌న్నీ పొగొట్టుకుంది. చివ‌ర‌కు చేసేదేమీలేక జూదం వ్య‌స‌నం మాన‌లేక త‌న‌ను తాను ప‌ణంగా పెట్టుకుని ఓడిపోయి ఆ య‌జ‌మాని వ‌శ‌మైపోయింది. అంద‌ర్నీ నివ్వెర‌ప‌రిచే ఈ సంఘ‌ట‌న  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌గ‌ఢ్‌లో జ‌రిగింది.

బాధిత మ‌హిళ ప్ర‌తాప్‌గ‌ఢ్ న‌గ‌రం కొత్వాలి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివ‌సించేది. ఆమె భ‌ర్త దేవ్‌క‌లి 6 నెల‌ల క్రితం జీవ‌నోపాది నిమిత్తం రాజ‌స్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లి అక్క‌డ ఇటుక‌బ‌ట్టీల్లో ప‌ని చేసి డ‌బ్బు సంపాదించి సంపాదించి భార్య‌కు డ‌బ్బులు పంపేవాడు. భ‌ర్త లేని స‌మ‌యంలో ఆమె ఈ డ‌బ్బుతో త‌న ఇంటి య‌జ‌మానితో క‌లిసి లూడో గేమ్ ఆడేది. ఈ జూదంలో ఆమె పందేలు కాసి ఆడేది. భ‌ర్త పంపిన డ‌బ్బుల‌న్నీ ఈ జూదంలో ఓడిపోయింది. ఈ వ్య‌స‌నానికి బానిసైన ఆమె చివ‌ర‌కు ఒక రోజు త‌న‌ను తానే ప‌ణంగా పెట్టి ఇంటి య‌జ‌మానితో లూడో గేమ్ ఆడింది. అందులోనూ ఓడిపోయి ఆమె అత‌డి వ‌శ‌మైంది. ఆ ఇంటి య‌జ‌మానితో క‌లిసి జీవించాల్సి వ‌చ్చింది.  

రాజ‌స్థాన్లో ఇటుక‌బ‌ట్టీల్లో ప‌నిచేస్తున్న భ‌ర్త‌కు ఈ విష‌యం తెలీదు. ఒక‌రోజు ఆమె భ‌ర్త తాను ఇంటికి వ‌స్తున్నాని ఫోనులో చెప్ప‌డంతో ఆమె అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. భార్య‌చెప్పిన సంగ‌తి విని ఆ భ‌ర్త నిర్ఘాంత‌పోయాడు. త‌రువాత తేరుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

.
త‌న భార్య‌కు ఆన్‌లైన్ గేమ్ ఆడే వ్య‌స‌నం ఉంద‌ని త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లున్నార‌ని, త‌న ఇంటి యజ‌మానికి కూడా ఇద్ద‌రు పిల్ల‌లున్నార‌ని, ఇలా జూదంలో ఓడిపోయింద‌నే కార‌ణంగా నా భార్య‌ను ఆయ‌న సొంతం చేసుకోవ‌డం అన్యాయ‌మ‌ని ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పుడు ఈ కేసు పంచాయ‌తీ చేస్తున్నారు. భార్య కోసం పోలీసు స్టేష‌న్ చుట్టూ తిరుగుతున్న భ‌ర్త వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. మీరు ఇంటికి వస్తే తనను చంపేస్తాడని చెప్పింది. మీరు ఇంటికి రాకుండా పోలీసులను కలవాలని కోరింది. దీంతో షాక్కు గురైన భర్త వెంటనే సొంత గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపాడు. ఇంటి యజమానికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News