అదేంటో అధికారంలో ఉన్న పార్టీకి సవాలక్ష అవలక్షణాలు అలా వచ్చేస్తాయి. ఇక వర్గాలు పోరులూ గొడవలూ ఇగోలు ఇవన్నీ కూడా కామనే. విషయానికి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా గుడివాడ అమరనాధ్ ప్రమాణం చేశారు. ఆయన మంత్రి అయి ఇరవై రోజులు పైదాటింది.
అంతవరకూ విశాఖ జిల్లా మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావుతో మాత్రం గుడివాడ కలసిన సందర్భం అయితే కనిపించలేదు. ఈ మధ్యన సీఎం జగన్ విశాఖ టూర్ లో ఇద్దరూ ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించారు. ఇక పార్టీ నాయకులు, మంత్రుల సమావేశంలో జగన్ అంతా కలసి సాగాలి. ఒకే త్రాటి మీద పార్టీ సాగాలి అని చెప్పినా ఎందుకో ఈ ఇద్దరికీ మాత్రం పొత్తు కుదరడంలేదు.
చిత్రమేంటి అంటే అవంతి శ్రీనివాసరావు విద్యా సంస్థలలోనే గుడివాడ చదువుకున్నారు. ఒక విధంగా అవంతి గురువు, గుడివాడ శిష్యుడు అని కూడా అనుకోవచ్చు. మరో వైపు చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరూ గతంలో బాగానే ఉండేవారు. బాబాయ్ అని చనువుగా గుడివాడ అవంతిని పిలుస్తారు. ఈయన అబ్బాయి అని ఆయన్ని ఆదరిస్తారు.
అయితే అది ఫ్లాష్ బ్యాక్. సీన్ కట్ చేస్తే మంత్రి పదవే ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది. దానికి ముందు వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా 2014 ఎన్నికల్లో గుడివాడ పోటీకి దిగితే టీడీపీ నుంచి అవంతి పోటీ చేశారు. అలా ఈ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ముఖా ముఖీ తలపడ్డారు. నాడు అవంతి గెలిచినా గుడివాడ ఓడినా వేరు వేరు పార్టీలు కాబట్టి కధ సాగిపోయింది.
2019 ఎన్నికల వేళ చూస్తే అవంతి టీడీపీని వీడి వైసీపీలోకి రావడంతో కలుస్తారేమో అనుకున్నారు. అయితే ఫస్ట్ చాన్స్ తనకు రాకుండా అవంతికి వెళ్ళడం పట్ల నాడు గుడివాడ ఫీల్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇక మూడేళ్ల పాటు అవంతి మంత్రిగా కొనసాగితే గుడివాడ నుంచి పెద్దగా సపోర్ట్ లేదని అంటారు.
ఇపుడు అదే విధంగా శిష్యుడికి సహాయ నిరాకరణ టేస్ట్ రుచి చూపించాలని అవంతి చూస్తున్నారు అంటారు. ఇక మే డే వేడుకలు విశాఖ పార్టీ ఆఫీసులో జరిగితే వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ హోదాలో గౌతం రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి అందరూ వచ్చినా జిల్లా ప్రెసిడెంట్ గా అవంతి హాజరుకాలేదు ఇక మంత్రి గుడివాడ ఇందులో పాల్గొన్నారు.
అదే టైమ్ లో అవంతి హైదారాబాద్ లో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికెళ్ళి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం. ఆ విధంగా ఈ ఇద్దరూ కామన్ ప్లాట్ ఫారం మీదకు రాకుండా దోబూచులాడుతున్నారు. మరి ఈ ఇద్దరికీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడం ఎవరి వల్ల అవుతుంది అన్న చర్చ అయితే ఉంది. మరి ఈ ఇద్దరూ కలిస్తేనే విశాఖ జిల్లాలో వైసీపీకి పట్టు చిక్కుతుంది. మరి అది జరిగే పనేలా.