ఇవాళ (శుక్రవారం, మే 13) పెద్ద ఓవైసీ అంటే అసరుద్దీన్ ఓవైసీ పుట్టిన్రోజు. ఉదయం సరికే ట్విటర్ కూతలో ముందుండే ఎంపీ సాయిరెడ్డి ఆయనకు విషెస్ చెప్పడం విశేషం. ఆ విధంగా పెద్ద ఓవైసీ అంటే ప్రేమ చాటుకున్నారు ఆయన.
పాలన పరంగా కానీ లేదా ఏ ఇతర విషయమై కానీ ఓవైసీ సోదరులు వైసీపీని ఈ 11 ఏళ్ల కాలంలో ఏనాడూ ఆదుకున్నది లేదు. అయినా కూడా పాత బంధాలను మాత్రం మరిచిపోకపోవడం ఎంత విడ్డూరం. ఆ విధంగా సాయిరెడ్డి పాత స్నేహాలను కలిపే ప్రయత్నం ఒకటి చేయడం నిజంగానే నిజంగానే విడ్డూరం. ఏం కాదు రాజకీయం అంటే ఇలానే ఉంటుంది. విని నవ్వుకోవడం మన వంతు.
వాస్తవానికి వైఎస్సార్ హవా బాగానే కొనసాగిన రోజుల్లో రాజారెడ్డి కుటుంబానికి, ఓవైసీ కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవి సంబంధిత వర్గాలు. అదే కోవలో ఆ రోజు ఎంఐఎం కూడా వీలున్నంత మేరకు వైఎస్సార్ సర్కారుకు మద్దతు ఇచ్చింది.
కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకు కూడా మద్దుతు ఇచ్చింది. అందంతా పైకి అందంగా కనిపించేందు కు, ప్రజలను తమకు అనుణంగా మలుచుకునేందుకు అనేక రకాల ఆభరణాలతో అలంకరించుకుని చేసే రాజకీయం. వాటి తీరు ఎలా ఉన్నా కూడా ఓవైసీ మాత్రం తరువాత కాలంలో జగన్-కు దూరం అయ్యారు. ఇప్పుడు పుట్టిన్రోజు శుభాకాంక్షల రూపంలో కాస్తో కూస్తో దగ్గర కావొచ్చు. ఏదేమయినా రాజకీయంలో ప్రతి ఫ్రెండూ అవసరమేరా !
వాస్తవానికి సోనియాతో తగాదా పెట్టుకున్నప్పుడు కానీ లేదా ఒంటరిగా యుద్ధం చేస్తూ జగన్ ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కానీ ఓవైసీ సోదరులు ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా స్పందించిన దాఖలాలే లేవు.అయినా దేశ రాజధానిలో ఓవైసీ సోదరుల సాయం కావాలని అనుకుంటున్నారో ఏమో అందుకనో ఎందుకనో సాయిరెడ్డి పాత బంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఓవైసీ ఇటుగా వచ్చి ప్రచారం చేస్తారన్న ఊహాగానాలూ ఉన్నాయి. ఆయన తప్ప మైనార్టీలను అమితంగా ఆకట్టుకునే నేతలు పెద్దగా వైసీపీకి లేరు. అందుకనో ,ఎందుకనో ఇవాళ పాత మిత్రుడికి ఓ పలకరింపు చేసి ఉండవచ్చు సాయిరెడ్డి.. ఏమో ! తెలియదు ముందున్న కాలమే అన్నింటినీ తేల్చుతుంది.