బ‌స్సు యాత్ర : న‌డిపింది బొత్స ! న‌డిపించింది జ‌గ‌న్ !

Update: 2022-05-30 05:30 GMT
సామాజిక న్యాయ భేరి పేరిట నాల్గు రోజుల పాటు బీసీ మంత్రులంతా చేప‌ట్టిన బ‌స్సు యాత్ర నిన్న‌టి వేళ అనంత‌పురంలో ముగిసింది. శ్రీ‌కాకుళంలో మొదల‌యిన ఈ భేరీ విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, తూగో,ప‌గో మీదుగా వివిధ జిల్లాలు చుట్టి వ‌చ్చింది.

అయితే భేరిని ముందుకు న‌డిపింది బొత్స స‌త్య‌నారాయ‌ణే ! వాస్త‌వానికి బొత్స‌తోపాటు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అనే సీనియ‌ర్ మినిస్ట‌ర్ ఉన్నా కూడా యాత్ర ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి ముగింపు వ‌ర‌కూ అన్నింటినీ ఆయ‌న ద‌గ్గ‌రుండి చూసుకున్నారు.

విజ‌య‌న‌గ‌రంలో వ‌ర్షం రీత్యా స‌భ ర‌ద్ద‌యినా అక్క‌డ నెల‌కొన్న ఇబ్బందుల‌ను అప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌డంలో బొత్స‌తో పాటు ఆయ‌న మేన‌ల్లుడు, జెడ్పీ  చైర్మ‌న్ చిన్న శ్రీ‌ను చొర‌వ చూపారు. చాలా బ‌స్సులు వ‌ర్షం కార‌ణంగా బుర‌ద‌లో కూరుకుపోయాయి. వీటిని జేసీబీల సాయంతో బ‌య‌ట‌కు లాగారు. అదేవిధంగాస‌భ ఆగిపోవ‌డంతో మంత్రులకు ఏ ఇబ్బందులూ రాకుండా వెంట‌వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇక బొత్స చెప్పిన మాట‌లు కూడా వివాదాల‌కు తావిచ్చాయి. తాము ఏం చేసినా అధికారం కోస‌మే చేస్తామ‌ని, తామేం మునులూ, రుషులూ మాదిరిగా త‌పస్సు చేసుకుని నిశ్చ‌ల స్థితిలో ఉండ‌లేమ‌ని, క‌నుక విప‌క్షం ఏం చెప్పినా అవి పట్టించుకోమ‌ని అన్నారు.

చంద్ర‌బాబు చెప్పిన విధంగా నిధుల దుర్వినియోగం అన్న‌ది లేనేలేద‌ని, ల‌క్ష కోట్ల‌కు పైగా సంక్షేమం అందిస్తే ఓర్వ‌లేక తాను అధికారంలోకి రాగానే ఆ నిధుల‌ను వెన‌క్కు  తెప్పించుకోవాల‌ని, జ‌నం నుంచి ముక్కుపిండి వ‌సూలు చేయాల‌ని చూస్తున్నార‌ని ఆస‌క్తిదాయ‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు బ‌స్సు యాత్ర‌ను వీలున్నంత వ‌ర‌కూ స‌జావుగానే న‌డిపారు. యాత్ర ఆరంభానికి ముందు రోజు  కోన‌సీమ‌లో అల్ల‌ర్లు జ‌ర‌గ‌డంతో కొంద‌రు మంత్రులు ఏం జ‌రుగుతుందో అన్న డైలమాలో ప‌డిపోయారు.

కానీ పోలీసు బందోబ‌స్తు ప‌క‌డ్బందీగా ఉండ‌డంతో శ్రీ‌కాకుళం ఎస్పీ రాధిక మొదలుకుని ఇత‌ర పోలీసు ఉన్న‌తాధికారులంతా అప్ర‌మ‌త్త‌మై మంత్రులకు ర‌క్ష‌ణ వ‌ల‌యంలా నిలిచారు. అదేవిధంగా ద‌ళిత సంఘాలు కొన్ని  నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయాల‌ని చూసినా వాటిని కూడా పోలీసులు ముందుగానే నిలువ‌రించి, సంబంధిత నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుని, స‌మీప స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.
Tags:    

Similar News