ఆయన మామూలు రాజకీయ నాయకుడు కాదు, పాతికేళ్ల పాలిటిక్స్ అనుభవం ఆయన సొంతం. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన ఇపుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఈ మధ్యనే ఆయన జగన్ మీద నేరుగా హాట్ హాట్ కామెంట్స్ చేసి ఏపీ రాజకీయాల్లో హైలెట్ అయ్యారు. అయితే రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న మాట కూడా ఉంది.
దాంతోనే గంటా మీద వైసీపీ మళ్లీ మనసు పడుతోందా అంటే అవును అని అంటున్నారు. గంటా అప్పట్లో అంటే రెండేళ్ల క్రితం వైసీపీలో చేరేందుకు చూశారు అని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకకు గట్టిగానే అభ్యంతరాలు వ్యక్తం చేసింది రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని కూడా చెబుతారు. ఇపుడు చూస్తే విశాఖ వైసీపీలో రాజకీయ సమీకరణలు అన్నీ మారిపోయాయి.
విజయసాయిరెడ్డికి బదులుగా వైవీ సుబ్బారెడ్డి రీజనర్ కో ఆర్డినేటర్ అయ్యారు. దాంతో వైసీపీలో కూడికలు చేరికల మీద మరో మారు చర్చ సాగుతోంది. విశాఖ జిల్లా విభజన తరువాత చిన్నదైపోయింది. పైగా టీడీపీకి పట్టు బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో విశాఖ జిల్లాలో పాలిటిక్స్ ని బ్యాలన్స్ చేయాలన్నా టీడీపీ కంచుకోటలో పాగా వేయాలన్నా బలమైన నేతలు చాలా చాలా అవసరం.
విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా అవంతి శ్రీనివాసరావుని నియమించినా విశాఖలో ఫ్యాన్ గిర్రున తిరగాలీ అంటే గంటా లాంటి వారి అవసరం ఉందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు అంటున్నారు. ఇక గంటా వస్తాను అంటే బ్రేకులు వేసేవారు ఎవరూ ఇపుడు వైసీపీలో లేరు అనే అంటున్నారు. అవంతి శ్రీనివాసరావు ఒకనాడు గంటా రాకను వ్యతిరేకించారు. ఇపుడు మాజీ మంత్రి అయ్యారు.
పైగా మునుపటి దూకుడు ఆయనకులేదు. దాంతో గంటా వస్తానంటే మాత్రం చేర్చుకునేందుకు వైసీపీ రెడీగా ఉంటుందని కూడా అంటున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీని బలోపేతం చేసే బాధ్యతలు చూస్తున్న కీలక మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా గంటా రాక ఆమోదయోగ్యమే అని అంటున్నారు. అలా అటు నుంచి కూడా నరుక్కు రావడానికి హై కమాండ్ చూస్తుంది అని చెబుతున్నారు.
టీడీపీలో కనుక సరైన గౌరవం లేకపోతే గంటా లాంటి వారు తమకు నచ్చిన చోటకు చేరుతారు అనే అంటారు. ఇపుడు బంతి అయితే గంటా కోర్టులోనే ఉంది అంటున్నారు. ఆయన వస్తాను అంటే వద్దంటామా అన్నట్లుగా వైసీపీ లో ఉందని చెబుతున్నారు. టోటల్ గా చెప్పేది ఏంటి అంటే వైసీపీ గంటా కోసం వెయిటింగ్. మరి గంటా మాస్టార్ ఫ్యాన్ నీడకు చేరుతారా. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. సో ఏది కాదు అనేది కూడా కాదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.