రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక మూలాలను ప్రశ్నార్థకం చేసి రాజకీయం నడపాలని ఓ ప్రధాన పార్టీ భావిస్తోంది. ఆ విధంగా ఆంధ్రావనిలో తనదే పై చేయి కావాలని పరితపిస్తోంది. గతంలో కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు బీజేపీ సాయంతో ఆ పార్టీ ప్రత్యర్థి వర్గాలపై అప్లై చేయనుంది.
ఇందుకు ఇప్పటికే కేంద్రం నుంచి కూడా కొంత సానుకూలత ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో చెట్టపట్టాలేసుకునే ఆ రెండు పార్టీల కారణంగానే తాము మరోసారి ఆర్థికంగా కుదేలయిపోవడం ఖాయమని టీడీపీ పెద్దల్లో గుబులు రేగుతోంది.
టీడీపీని నిలువరించే క్రమంలో గతంలో మాదిరిగానే వైసీపీ మరో సారి ఈడీని ప్రయోగిస్తే ఏమౌతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఇప్పటికే జేసీ బ్రదర్స్ ఇళ్లపై ఈడీ దాడులు షురూ అయ్యాయి. ఇవి ముమ్మాటికి ప్రత్యర్థి పార్టీ చేసిన పనే అని ఆరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన దాఖలాలున్నాయి.
ఇప్పటికే ఆయన చాలా దూకుడుగా ఉన్నారన్న నెపంతో జగన్ ఈ విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను తనకు అనుగుణంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి..టీడీపీ వైపు నుంచి..!
టీడీపీలో ఈడీ కలకలం రేపుతోంది. తాజాగా కొన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా టీడీపీ పెద్దల ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వైసీపీ పెద్దలే దాడులకు కారణం అవుతున్నారని ఇప్పటికే టీడీపీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసి ఉంది.
ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి ఓ జాబితా కూడా సిద్ధం అయి ఉందని, ఇరవై మంది పేర్లతో ఓ లిస్టు సిద్ధమై ఉందని కూడా తెలుస్తోంది. ఇవే ఇప్పుడు కలవరపాటుకు కారణం అవుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా పలు సందర్భాల్లో ఈడీ దాడులకు టీడీపీ నాయకులు అడ్డంగా దొరికి పోయిన దాఖలాలు ఉండడంతో మురళీమోహన్ లాంటి పెద్దలకు ఇటువంటి అనుభవాలు ఉండడంతో తాజా వార్తలు కొంత ఆందోళనకు తావిస్తున్నాయి.