ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న ఓ యువతిని ఆమె లివ్ ఇన్ పార్ట్‌నర్ ఆఫ్తాబ్ దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా నరికి చంపిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు శ్రద్ధ స్నేహితులను, ఆ దంపతుల పూర్వపు యజమానులను విచారించగా మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయి.
అఫ్తాబ్ పూనావాలా -శ్రద్ధా వాకర్ మధ్య నెలల తరబడి గొడవలు జరిగాయి. ఇంటి ఖర్చులు ఎవరు చెల్లించాలనే దానిపై మే 18 సాయంత్రం గొడవ జరిగింది. ఇదే శ్రద్ధను చంపేలా చేసిందని సమాచారం. శ్రద్ధా స్నేహితులు ఒకరినొకరు మోసం చేశారనే అనుమానంతో తరచూ గొడవలు పడేవారని తెలిసింది. హత్య జరిగిన రోజు వారు కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేయడం.. మరిన్ని సమస్యలకు దారితీసిందని.. దీనిపైనే గొడవపడి, రాత్రి 8 -10 గంటల మధ్య అఫ్తాబ్ పూనావాలా ఏకంగా శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి చంపాడని విచారణలో తేలింది.
రాత్రంతా మృతదేహాన్ని అదే గదిలో ఉంచి, మరుసటి రోజు కత్తి, ఫ్రిజ్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడని నివేదికలు చెబుతున్నాయి. అతను మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, కొత్త ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాతి 18 రోజులలో వాటిని సమీపంలోని అడవిలో పారేశాడు.
అఫ్తాబ్ తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించి ఆమె బతికే ఉందని అందరినీ నమ్మించేవాడు. అతను ఆమె ఫోన్ యాప్ , కొన్ని ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ల నుండి బ్యాంక్ ట్రాన్స్ ఫర్ లను చేశాడు. తన అకౌంట్ కు నగదును బదిలీ చేసుకున్నాడు. మే 22న ఆమె తనంతట తాను వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపాడు.
అయితే పోలీసులు శ్రద్ధ ఫోన్ నుంచి అమీన్ జరిపిన ఆన్ లైన్ లావాదేవీలు, ఆమె బతికే ఉన్నట్టు స్నేహితులను నమ్మించేందుకు ఆమె ఫోన్ లోని సోషల్ మీడియా ద్వారా చేసిన చాటింగ్ లను గుర్తించారు. ఆమె ప్లేసులో అమీన్ ఈ లావాదేవీలు చేసినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించారు. ఆన్ లైన్ లావాదేవీలే అమీన్ ను పట్టించాయి. కేసు ఛేదనలో పోలీసులకు కీలకంగా మారాయి. మే 26న శ్రద్ధ ఖాతా నుంచి బ్యాంకింగ్ యాప్ ద్వారా అమీన్ కు రూ.54వేలు ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తించారు. లోకేషన్ మెహ్ రౌలీలోని వారు అద్దెకు ఉన్న ఫ్లాట్ నే చూపించింది. దీంతో శ్రద్ధ ఇల్లు విడిచిపోతే అమీన్ ఫ్లాట్ లో ఆన్ లైన్ డబ్బులు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇది చేసింది అమీన్ అనిపోలీసులు గుర్తించారు. అమీన్ మాటలకు చేష్టలకు పొంతన కుదరకపోవడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయాలను అమీన్ బయటపెట్టాడు.
అఫ్తాబ్ -శ్రద్ధా ముంబైలోని కాల్ సెంటర్లలో పనిచేశారు. గత సంవత్సరం నుండి సహజీవనం చేశారు. వారు ఈ సంవత్సరం మేలో ఢిల్లీకి వచ్చారు. వారం రోజులు హోటల్‌లో బస చేసిన తర్వాత మే 14న అద్దెకు ఫ్లాట్ తీసుకున్నారు. తరచూ పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ వేధించడంతో ఆమెను చంపి 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచినట్టు వెల్లడించాడు. రోజూ రాత్రి 2 గంటల సమయంలో తన ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లి ఆమె శరీర భాగాలను ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విసిరేసినట్టు బయటపెట్టాడు. ఈ ఘటన దేశమంతా దుమారం రేపింది.
అఫ్తాబ్ నేరం అంగీకరించాక పోలీసులను మెహ్రౌలీ అడవికి తీసుకెళ్లి శ్రద్ధకు చెందిన కొన్ని ఎముకలను పడేసిన చోట చూపించాడు. ఆమె తండ్రి డీఎన్ఏ నమూనాలతో అవి సరిపోలాయా లేదా? అన్న విషయాలపై తనిఖీ చేయడానికి వారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అతని ఫ్లాట్‌లో కొన్ని రక్తపు మరకలను కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు అఫ్తాబ్ ఆమె శరీరంలోని 35 ముక్కలలో కనీసం 10 ముక్కల వరకు పోలీసులకు చూపించాడు.
మృతదేహాన్ని నరికిన కత్తి ఇంకా లభ్యం కావాల్సి ఉంది. అలాగే తెగిపోయిన తల లేదా ఏదైనా ఇతర గుర్తించదగిన శరీర భాగాన్ని సేకరించాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.