ఐపీఎల్ వేలం.. ఏ జట్టు ఎవరిని వేలంలో పెట్టాయంటే?

Update: 2022-11-16 07:10 GMT
క్రికెట్ ను జెంటిమెన్ గేమ్ స్థాయి నుంచి ఫక్తు వ్యాపార క్రీడగా మార్చిన ఘనత బీసీసీఐకు చెల్లుతుంది. ఎప్పుడైతే ఐపీఎల్ అంటూ ఫ్రాంచైజీల్ని తెర మీదకు తీసుకొచ్చి.. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో జట్టు కట్టబెట్టటం.. అందులో ఆడాల్సిన క్రీడాకారుల్ని ఎంపిక చేసుకోవటానికి వీలుగా అవకాశాన్ని ఇవ్వటం.. అవసరం లేదనుకుంటే తాము వేలంలో సొంతం చేసుకున్న ఆటగాళ్లను తిరిగి వేలంలో పెట్టేయటం లాంటివి తెలిసిందే.

వచ్చే నెల అంటే డిసెంబరు 23న కోచి వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ కు సంబంధించిన మినీ వేలాన్నినిర్వహిస్తున్నారు. ఈ వేలంలో ఆయా జట్లు తమ వద్ద ఉంచుకునే క్రీడాకారుల జాబితాతోపాటు.. వేలంలో పెట్టేందుకు వీలుగా తమ వద్ద ఉన్న క్రీడాకారుల్ని ఇచ్చేలా జాబితాను సమర్పించాల్సి ఉంది. తాజాగా గడువు ముగియటంతో.. ఆయా జట్ల యజమానులు తాము వదిలించుకునే ఆటగాళ్ల వివరాల్ని ఇచ్చేశారు. మరి.. ఏ జట్టు ఏ క్రీడాకారుడ్ని వదిలించుకోవటానికి సిద్ధమైంది? ఎవరు ఎక్కువ మందిని వదిలించుకుంటున్నారు? ఎవరు తక్కువ మందిని వేలంలో పెడుతున్నారు? అన్న విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గుజరాత్ టైటాన్ వేలంలో పెట్టిన ఆటగాళ్లు వీరే. మొత్తం ఆరుగురిని వదిలేసుకుంది.

-  రహ్మానుల్లా గుర్బాజ్
-  లాకీ ఫెర్గూసన్
-  డొమినిక్ డ్రేక్స్
-  గురుకీరత్ సింగ్
-  జాసన్ రాయ్
-  వరుణ్ ఆరోన్

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే మొత్తం ఐదుగురిని వేలానికి పెట్టింది. వారిలో ఎవరున్నారంటే..

-  శార్దూల్ ఠాకూర్
-  టిమ్ సీఫెర్ట్
-  అశ్విన్ హెబ్బార్
-  కేఎస్ భరత్
-  మన్ దీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్ జట్టు తొమ్మిది మంది ప్లేయర్లను వేలానికి పెట్టింది. వారెవరంటే..

-  అనునయ్ సింగ్
-  కార్బిన్ బాష్
-  డారిల్ మిచెల్
-  జేమ్స్ నీషమ్
-  కరుణ్ నాయర్
-  నాథన్ కౌల్టర్ -నైల్
-  రాస్సీ వాన్ డెర్ డస్సెస్
-  శుభమ్ గర్వాల్
-  తేజస్ బరోకా

కోల్ కతా నైట్ రైడర్స్ లో మొత్తం 16 మంది ఆటగాళ్లను వేలంలోకి పెట్టేసింది. వారెవరంటే..

- పాట్ కమిన్స్
-  సామ్ బిల్లింగ్స్
-  అమన్ ఖాన్
-  శివమ్ మావి
-  మహ్మద్ నబీ
-  చమికా కరుణరత్నే
-  ఆరోన్ ఫించ్
-  అలెక్స్ హేల్స్
-  అభిజీత్ తోమర్
-  అజింక్య రహానే
-  అశోక్ శర్మ
- బాబా ఇంద్రజిత్
-  ప్రథమ్ సింగ్
-  రమేశ్ కుమార్
-  రసిఖ్ సలామ్
-  షెల్డన్ జాక్సన్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ఆటగాళ్లలో ఎనిమిది మంది ఆటగాళ్లను తిరిగి ఇచ్చేసింది. వేలానికి సిద్దమైన ఆ ఆటగాళ్లు ఎవరంటే..

-  డ్వేన్ బ్రేవో
- రాబిన్ ఉతప్ప
-  ఆడమ్ మిల్నే
- హరి నిశాంత్
-  క్రిస్ జోర్డాన్
-  భగత్ వర్మ
-  కేఎం ఆసిఫ్
-  నారాయణ్ జగదీశన్

పంజాబ్ కింగ్స జట్టు మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను వేలానికి పెట్టింది. వారెవరంటే..

-  మయాంక్ అగర్వాల్
-  ఒడియన్ స్మిత్
-  వైభవ్ అరోరా
-  బెన్నీ హోవెల్
-  ఇషాన్ పోరెల్
-  అన్ష్ పటేల్
-  ప్రేరక్ మన్కడ్
-  సందీప్ శర్మ
-  రిటిక్ ఛటర్జీ

రాయల్స్ ఛాలెంజర్స్లో మొత్తం ఐదుగురిని వేలానికి విడిచి పెట్టింది. వారెవరంటే..

-  జాసన్ బెహ్రండార్ఫ్
-  అనీశ్వర్ గౌతమ్
-  చామా మిలింద్
-  లువ్నిత్ సిసోడియా
-  షెర్పాన్ రూథర్ ఫోర్డ్

సన్ రైజర్స్ లో జట్టుకు చెందిన పన్నెండు మందిని వేలానికి ఇచ్చేసింది. వారెవరంటే..

- కేన్ విలియన్స్
-  నికోలస్ పూరన్
-  జగదీశ సుచిత్
-  ప్రియమ్ గార్గ్
-  రవికుమార్ సమర్థ్
-  రొమారియా షెపర్డ్
- సౌరభ్ దూబే
-  సీన్ అబాట్
-  శశాంక్ సింగ్
-  శ్రేయాస్ గోపాల్
-  సుశాంత్ మిశ్రా
-  విష్ణు వినోద్

ముంబయి ఇండియన్స్ సైతం 13 మంది ఆటగాళ్లను వేలానికి విడిచిపెట్టింది. వారెవరంటే..

-  కీరన్ పొలార్డ్
-  అన్మోల్ ప్రీత్ సింగ్
-  అర్యన్ జుయల్
-  బాసిల్ థంపి
-  డేనియల్ సామ్స్
-  ఫాబియన్ అలెన్
-  జయదేవ్ ఉనద్కత్
-  మయాంక్ మార్కండే
-  మురుగన్ అశ్విన్
-  రాహుల్ బుద్ది
- రిలే మెరెడిత్
-  సంజయ్ యాదవ్
-  టైమల్ మిల్స్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన జట్టులోని ఆటగాళ్లలో ఏడుగురిని వేలానికి ఇచ్చేసింది. వారెవరంటే..

-  ఆండ్రూ టై
-  అంకిత్ రాజ్ పూత్
-  దుష్మంత్ చమీర
-  ఎవిన్ లూయిస్
-  జాసన్ హోల్డర్
-  మనీష్ పాండే
-  షాబాజ్ నదీమ్



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News