మునుగోడు ప్రజల నాడి: ఎవరు డబ్బులిస్తే వారికి ఓటేస్తాం

Update: 2022-10-17 14:30 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకూ పంచారని ప్రచారం సాగింది. ఎక్కువ ఓట్లు ఉన్న ఇంటికి రూ.50వేల ప్యాకేజీ కూడా ఇచ్చారని టాక్ నడిచింది. కానీ ఇన్ని డబ్బులు తీసుకున్నా కూడా ఇచ్చిన వారిని వదిలేసి తమకు నచ్చిన నేత (ఈటల రాజేందర్) నే గెలిపించారు ప్రజలు. పంచిన డబ్బుంతా ప్రజల నుంచి దోచుకున్నదే కదా? అని వాళ్లంతా ఇలా డిసైడ్ అయ్యారు.

ఇప్పుడు మునుగోడు ప్రజలు కూడా అంతకుమించి డబ్బులు తీసుకునేందుకు రెడీ అయ్యారట.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలంతా ఏ పార్టీవైపు ఉంటారో ఓ వ్యక్తి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో 'ఎవ్వడు పైసలిస్తే వాడికే ఓటు వేస్తాం. ఇదో జాతర.

ఇప్పుడు ఈయనతో వెళ్లినోళ్లం ఓటేస్తామని లేదు. రేపు టీఆర్ఎస్ ఆయన వస్తే.. ఆ కండువా కప్పుకుంటాం. వీళ్లు ఎలాగో గెలిచి పనిచేయరు.. వాళ్లకు అడిగే హక్కు కూడా లేదు. ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడు మాకు అడిగే హక్కు లేదు' అని ఓటర్లు కుండబద్దలు కొట్టారు.

ఇలా మునుగోడులో డబ్బుల ప్రవాహం నడుస్తోంది. బడా కాంట్రాక్టర్, భారీగా డబ్బులున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అండతో ఇక్కడ కుమ్మరిస్తున్నాడని.. చోటా మోటా నేతలకు రూ.10 లక్షల చొప్పున ప్యాకేజీలు ఇచ్చి మరీ పంచేస్తున్నాడని ఆరోపణలున్నాయి.

ఇక అధికార పార్టీ అయితే మరింతగా కొనుగోళ్లు చేస్తోందని.. నేతలందరికీ డబ్బు, మద్యం ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెసోళ్లు ఏమో పాదయాత్రలు చేస్తూ కాళ్లు మొక్కే పనిలో పడ్డారు. వాళ్లు పెద్దగా డబ్బులు పంచకున్నా కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటేస్తాం అన్నట్టుగా మునుగోడు ఓటర్లు తయారయ్యారట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.




Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News