సీమలో ఫేట్ మారుతోందా...ఎవరిది అప్పర్ హ్యాండ్....?

Update: 2022-10-10 03:49 GMT
రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలుపుకుని 52 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో రెండు జిల్లాలను 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మిగిలిన దాంతో  అనంతపురంలో రెండంటే రెండు సీట్లు టీడీపీకి వస్తే చిత్తూరులో చంద్రబాబు తప్ప ఎవరూ గెలవలేదు. అంటే మూడు తప్ప 48 సీట్లను గెలుచుకుని వైసీపీ టాప్ రేపింది. అయితే మూడున్నరేళ్ల వైసీపీ ఏలుబడిలో సీమలో సీన్ ఎలా ఉంది అంటే చాలా చాలా మారింది అని అంటున్నారు.

వైసీపీ పుట్టాక టీడీపీకి ఇక్కడ గట్టిగా పెర్ఫార్మ్ చేసి మెజారిటీ సీట్లను కొట్టలేకపోయింది. కానీ 2024 లో అలాంటి పరిస్థితి ఉండదమే అంటున్నారు. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది అని చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడపలోనే సీన్ మారుతోంది అని చెబుతున్నారు. పది కి పది సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఈసారి రెండు మూడు సీట్లను టీడీపీకి అప్పగించకతప్పదా అన్న చర్చ ఉంది. అలాగే అనంతపురంలో తీసుకుంటే మొత్తం 14 సీట్లకు గానూ ఈసారి టీడీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని అంటున్నారు.

ఇక్కడ వైసీపీ 2019లో 12 సీట్లు గెలుచుకుంటే ఈసారి వైసీపీ కి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా  మంత్రులుగా పనిచేసిన వారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కానీ తమ పనితీరుని ఏ మాత్రం చూపించలేకపోయారు అన్నదే ప్రధాన పాయింట్ అంటున్నారు. దానికి తోడు సహజనగా టీడీపీకి ఉన్న బలం ఇపుడు రెట్టింపు అయింది అంటున్నారు.

ఇక కర్నూల్ లో చూసుకుంటే 2014లో కొంత తగ్గినా 2017 నాటికి భూమా ఫ్యామిలీని తన వైపు లాగేసుకుని బాగానే పట్టు సాధించింది. 2019లో టోటల్ గా సీట్లు మొత్తం పోగొట్టుకున్నా పార్టీ పట్టు అలాగే ఉందని అంటున్నారు. ఇపుడు వైసీపీ పాలన చూశాక ఆ వ్యతిరేకత కచ్చితంగా టీడీపీకి ప్లస్ అయింది అని అంటున్నారు. పైగా జగన్ సీఎం అయితే సీమకు బాగా ఉపయోగం అనుకుంటే వారి ఆశలు తల్లకుందులు అయ్యారని అంటున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా చంద్రబాబు కుప్పం సీటునే కొడతామని వైసీపీ చూస్తోంది కానీ గతం కంటే ఇక్కడ బెటర్ గా టీడీపీ పెర్ఫార్మ్ చేస్తుందని చెబుతున్నారు. అయితే కడప తరువాత వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేది మాత్రం చిత్తూరు జిల్లావే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సీంలో ఉన్న 52 సీట్లకు గానూ పాతిక సీట్లలో ఈ రోజుకు టీడీపీ పట్టు సాధించింది అని చెబుతున్నారు.

ఇక్కడ తమాషా ఏంటి అంటే సీమలో తమకు పట్టు తగ్గుతోందని వైసీపీ గ్రహించిందిట. అందుకే  2019లో వచ్చిన 49 సీట్లలో ఈసారి నలభై సీట్లు దక్కినా చాలు అనుకుంటోంది అంటున్నారు. అంటే వైసీపీయే 12 సీట్లు టీడీపీకి దక్కుతాయనుకుంటే నాలుగు రెట్లు సైకిల్ పార్టీ బలం పెరిగినట్లే కదా అన్న చర్చ ముందుకు వస్తోంది. మరి 2024 నాటికి మెజారిటీ సీట్లకు టీడీపీ  గేలం వస్తే వైసీపీకి అతి పెద్ద దెబ్బ పడడం ఖాయమే అని  అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News