ఆనం ఫైర్ బాగుంది.. కానీ, ఫ్యూచ‌రేంటి?

Update: 2023-01-20 04:18 GMT
వైసీపీ ఎమ్మెల్యే, వెంట‌గిరి శాస‌న స‌భ్యులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఫైర్ బాగుంది. గత ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న వెంక‌ట‌గిరి నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇది బాగానే ఉంది. అయితే, ఆయ‌న మంత్రి వ‌ర్గంలో చోటు ఆశించారు. లేదా నామినేటెడ్ ప‌ద‌వి అయినా.. ఇస్తార‌ని అనుకున్నారు. కానీ, నెల్లూరు జిల్లాలో వైసీపీకి అనేక మంది నాయ‌కులు ఉన్నారు. వారిని ప‌క్క‌న పెట్టి ఆనంకు ప‌ట్టం క‌ట్టే ప‌రిస్థితి లేదు.

ఈ విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆశ‌ప‌డ్డారు. కానీ, ద‌క్క‌లేదు. దీంతో  ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. మూడున్నరే ళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని... ఒక ఇల్లు కట్టామా? రోడ్లలో ఏర్పడిన గుంతలపై తట్టెడు మన్ను పోశామా? జనం ఎందుకు ఓట్లు వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

పింఛను ఇచ్చినంత మాత్రాన మనకు ఎందుకు ఓట్లు వేయాలి? ముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి కదా? అని ప్రశ్నించారు. అలాగే తనను నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఇంకా ఏడాదన్నర పాటు తానే ఎమ్మెల్యేగా వుంటానని కూడా వ్యాఖ్యానించారు.

ఈ తీరుతో ఆనం వైసీపీలో కొనసాగడం అనుమానంగా మారింది. దానికి తగ్గట్టు అధిష్ఠానం కూడా వేగంగా స్పందించింది. ఆనం ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన వారం లోపే ఆయన్ను నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఆ స్థానంలో రామ్‌కుమార్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది.

క‌ట్ చేస్తే..  ఇప్పుడు ఆనం ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ న మ‌రోసారి టీడీపీలోకి వెళ్లే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు, చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు కోసం క‌ష్ట‌ప‌డుతు న్నారంటూ.. కామెంట్లు చేశారు. దీనికి తోడునెల్లూరు టీడీపీ నేత‌ల‌కు ఆనంకు అస్స‌లు ప‌డ‌డం లేదు.

దీంతో ఆనం మ‌రోసారి టీడీపీ గ‌డ‌ప తొక్కే ప‌రిస్థితి లేదు. దీంతో ఆనం దారెటు? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న ముందు రెండే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి జ‌న‌సేన లేదా బీజేపీని ఎంచుకోవ‌డం.. లేదా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగ‌డం! మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News