AP : అబ్బా ! కొత్త మంత్రుల‌కు కొత్త క‌ష్టం..ఆ ప‌దం ప‌ల‌క‌లేరా?

Update: 2022-04-12 06:30 GMT
ఎవ‌రి భాష వారికి గౌర‌వం ఎవ‌రి భాషంటే వారికి ప్రేమ.. భాష విష‌య‌మై ముఖ్య‌మంత్రి దిగ‌జార‌కూడ‌దు. ప‌లికే విష‌య‌మై త‌ప్పులు పోకూడ‌దు. ఎన్ని  సార్లు చెప్పినా వైసీపీ భాష మార‌దు. ఆ మాట‌కు వ‌స్తే ఆ మంత్రులే కాదు ముఖ్య‌మంత్రి భాష కూడా ఈ మ‌ధ్య కాలంలో దిగ‌జారుతోంది.ఈ ద‌శ‌లో ప్ర‌మాణ స్వీకారం వేళ మ‌న మంత్రుల భాష చాలా త‌ప్పుల‌తో కూడుకుని ఉంది. అయినా కూడా క్ష‌మించేద్దాం. ఏం చేయ‌గ‌లం.. గుమ్మ‌నూరు జ‌య‌రాం కానీ మ‌రొక‌రు కానీ క‌నీసం ఒక‌టికి రెండు సార్లు ప్ర‌మాణ ప‌త్రం చదివి వ‌స్తే త‌ప్పులు రావు క‌దా! ఆ పాటి శ్ర‌ద్ధ లేకుండా ఎలా?

భాష‌ను ప్రేమించ‌డం ముందు నేర్చుకోవాలి ఎవ్వ‌రైనా.. సంస్కృతిని ప్రేమించ‌డం ముందు నేర్చుకోవాలి ఎవ్వ‌రైనా.. క‌ష్ట‌మ‌యినా న‌ష్ట‌మ‌యినా  అన్ని వేళ‌లా భాష‌కు స‌మున్న‌త ప్రాధాన్యం ఇవ్వాలి. మ‌న దుర‌దృష్టం క‌నీసం ప‌దాలను ప‌లికే  స్థాయిలో కూడా మంత్రులు  లేక‌పోవ‌డం.. ఇప్ప‌టికే తెలుగు క‌నుమ‌రుగ‌యిపోతోంద‌ని బెంగ‌ప‌డుతున్న భాషాభిమానుల‌కు మ‌న మంత్రులు ప‌దోచ్ఛార‌ణ  వింటే బాధ ప‌డ‌డం ఖాయం.

భాష‌ను ఆ మాత్రం అర్థం చేసుకుని ప‌ల‌క‌డం రాక‌పోతే రేపు వీళ్లేం పాలిస్తార‌ని.. సార్వ‌భౌమాధికారం ఈ ప‌దం ఓ వంద సార్లు వీళ్ల‌తో ప‌లికించండి జ‌గ‌న్.. పోనీ అంతఃక‌ర‌ణశుద్ధి ఈ ప‌దం కూడా!

ఇవాళ ఆంధ్రావ‌నిలో మంత్రుల ప్ర‌మాణ స్వీకార సంరంభం అతి వైభ‌వంగా జ‌రిగింది. వెల‌గపూడి కేంద్రంగా స‌చివాల‌యం బ్లాక్ ఒన్ కు అనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక‌పై గ‌వ‌ర్న‌ర్ సీఎం ఆశీనులు కాగా మిగ‌తా వారంతా ఒక్కొక్క‌రుగా వ‌చ్చి దేవుడి సాక్షిగా ప్ర‌మాణం చేశారు. ఆదిమూలం సురేశ్, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ఉషా శ్రీ చ‌ర‌ణ్ ఇంగ్లీషులో ప్ర‌మాణం చేశారు.

అయితే మంత్రుల‌లో కొంద‌రు అంతఃక‌ర‌ణ శుద్ధి అన్న ప‌దం ప‌ల‌క‌లేక‌పోయారు. సార్వ‌భౌమాధికారం అన్న ప‌దం కూడా ఒక‌రిద్ద‌రు త‌ప్పు ప‌లికారు. అయినా ఆ టెన్ష‌న్ లో ఆ పాటి త‌ప్పులు స‌హ‌జం అని స‌ర్దుకుపోవాలి క‌దా అయినా ఎందుకు రైజ్ చేయ‌డం అని మాత్రం అనొద్దు.

మ‌న భాష మ‌న‌మే బాగా ప‌ల‌కాలి. ఒక‌రిద్ద‌రు మంత్రులు సీఎం కాళ్ల మీద ప‌డ్డారు.ఇది మ‌రీ టూమ‌చ్. ఎందుక‌ని అంత అతి చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని విప‌క్షం నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ  బొత్స ప్ర‌మాణ స్వీకారం వేళ ఈలలూ గోల‌లూ వినిపించాయి. అలానే ఇంకొంద‌రి విష‌య‌మై కూడా అనుచరులు ఈలలు వేస్తూ గోల చేస్తూ స‌భా ప్రాంగ‌ణంలో కొత్త ఉత్సాహం నింపారు. చాలా రోజుల‌కు ముఖ్య‌మంత్రి న‌వ్వుతూ క‌నిపించారు.
Tags:    

Similar News