రాష్ట్రపతి ఎన్నికల వేళ టీడీపీ బీజేపీ ఒకే వేదికను పంచుకున్నాయి. చాలా కాలానికి రెండు పార్టీల నేతలు కలసి పలకరించుకుని నవ్వులు చిందించారు. అయితే ఇది సుదీర్ఘకాలంలో బంధం గా మారుతుంది అని అంతా విశ్లేషించుకున్నారు. కానీ ఈ లోగానే తిరుపతి లడ్డూలు ఒకటి కాదు రెండు టీడీపీ చేతిలో బీజేపీ పెట్టి ఇక వైసీపీని చెడుగుడు ఆడుకోమని పచ్చ జెండా ఊపేసింది అంటున్నారు.
ఒకే రోజు రెండు కీలకమైన పరిణామాలు ఢిల్లీ వేదికగా జరిగాయి. ఆ పరిణామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతూంటే టీడీపీ యమ జోరుతో ఢీ కొడుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తప్పంతా వైసీపీ సర్కార్ దే అని ఆడిపోసుకుంది. వైసీపీ ప్రభుత్వం అసమర్ధ నిర్వాకం మూలంగానే పోలవరం ఆలస్యం అవుతోదని కూడా విమర్శలు చేసింది.
ఇదొక బ్రహ్మాండమైన అస్త్రంగా టీడీపీకి మారింది. దీని పట్టుకుని ఏపీకి చెందిన మాజీ జలవనరుల శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వైసీపీని టార్గెట్ చేశారు. అంతా మీ పుణ్యమే. పోలవరాన్ని నాశనం చేశారు. మీరుంటే 2024 ఏంటి ఎప్పటికీ పోలవరం పూర్తి కాదు అనేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
మరో వైపు శ్రీలంక పరిస్థితుల మీద అక్కడ ఆర్ధిక సంక్షోభం మీద కేంద్రం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏపీలో అప్పులను ముందు పెట్టి పరువు తీసింది. నిన్నటికి నిన్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ చేత ఓటేయించుకున్నామన్న ఆలోచన లేకుండా ఏపీలో అప్పుల కుప్ప అంటూ రంగు బయటేసింది. దాంతో ఏపీ శ్రీలంక అవుతుందని ముందు నుంచి తాము చెబుతూనే ఉన్నామని టీడీపీ ఏపీ నేతలు పాట అందుకున్నారు.
ఏపీలో ఆర్ధిక ఆడిట్ నిర్వహిస్తే వైసీపీ సర్కార్ గుట్టు బయటపడుతుంది అని ప్రజాపద్దుల చైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్నొన్నారు. మీకు అంత సత్తా ఉందా అని ఆయన సవాల్ చేస్తున్నారు. ఏపీలో అప్పుల కుప్ప అన్న అజెండాతోనే 2024 ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న టీడీపీకి పోలవరం ప్రాజెక్ట్ కూడా మరో అస్త్రంగా మారుతోంది. వీటికి తోడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ మరో చిన్న లడ్డూని కూడా కేంద్రం టీడీపీలో చేతిలో పెట్టింది.
ఇంకా ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా వైసీపీ ఓట్లు వేయాలి కానీ ఇంతలోనే కేంద్రంలోని బీజేపీ ఇలా వైసీపీని రోడ్డున నిలబెట్టేయడం ఏమిటి అన్న చర్చ అయితే అధికార పార్టీలో సాగుతోంది. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంటే లోక్ సభ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటేస్తారు. అక్కడ ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉంది. రాష్ట్రపతి ఎన్నికలే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో వైసీపీ మద్దతు కావాల్సి వచ్చింది. ఆ ముచ్చట అలా తీరిందో లేదో కొద్ది గంటలలోనే ఏపీలో వైసీపీ మీదకు టీడీపీని ఎగదోసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇపుడే ఇలా ఉంటే ఆగస్ట్ తరువాత కేంద్రంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత ఇంకా ఏమి జరగనుందో అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఏపీని బీజేపీ మామూలుగా వదలేది ఉండదని అంటున్నారు. ఉప్పూ నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ రచ్చను రాజేసి అందులో నుంచి లబ్దిని పొందే మాస్టర్ ప్లాన్ కి తెర తీయనుంది అంటున్నారు. మొత్తానికి ఆత్మ రక్షణలో పడిన వైసీపీ అటు జనాలకు ఇటు విపక్షలకు సమాధానం ఎలా చెబుతుందో చూడాల్సిందే.