మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెనీ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా ప్రజలందరూ యూపీఐ లావాదేవీలకే ఎక్కువ మొగ్గు చూపిస్తూ వచ్చారు. దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ నెలలో 4 బిలియన్లకు పైగా యుపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. పండుగ సీజన్ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది. యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. విలువ పరంగా అక్టోబర్ నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.7.71 ట్రిలియన్లకు సమానం.
సెప్టెంబర్ నెలలో రూ.6.5 ట్రిలియన్ విలువైన 3.65 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంటే అక్టోబర్ లో యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం పెరుగగా, లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. యూపీఐ లావాదేవీల సంఖ్య మరియు విలువ గత సంవత్సరం ఈ సమయం కంటే రెట్టింపు కంటే ఎక్కువ.2016లో యూపీఐ సేవలు ప్రారంభమవగా.. కరోనా మహమ్మారి తర్వాత వీటి వినియోగం భారీగా పెరిగింది.
2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది.