స్టేడియంకు తాళం వేశారే...

Update: 2015-05-09 10:55 GMT
హైదరాబాద్ లో ఐపీఎల్ సహా ఇతర మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఇటీవల కాలంలో వార్తలో నిలిచిన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఉప్పల్ స్టేడియాన్ని నిర్వహిస్తున్న హెచ్ సీఎ 2002 నుంచి జీహెచ్ ఎంసీకి ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సిఉంది. మొత్తం రూ.12 కోట్లను హెచ్ సీఎ చెల్లించాల్సి ఉంది. గతవారం జీహెచ్ ఎంసి హెచ్ సీఎకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ స్టేడియం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్తిపన్ను చెల్లింపుకు సంబంధించి.. జీహెచ్ఎంసీ అధికారులతో హెచ్ సిఎ ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఈనేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లించనందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హెచ్ సీఎ...మ్యాచ్ కు ఐపిఎల్ నుంచి 75 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు.

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 11, 15, 17 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత శనివారం తొలి మ్యాచ్‌కు ముందే ‘ఐలా’ స్టేడియం సీజ్ చేసేందుకు యత్నించగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌తో చర్చల అనంతరం మరికొంత గడువు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. బకాయిలకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు నోటీ సులు పంపించామని, అయినా సంస్థ స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ క్రికెట్‌ స్టేడియంను అధికారులు విడిపించకపోవడం వల్ల ఐపిఎల్‌ నిర్వహణకు విఘాతం ఏర్పడితే అంతర్జాతీయంగా క్రికెట్‌ ప్రపంచంనుంచి విమర్ళలు ఎదుర్కోవలసివస్తుంది.
Tags:    

Similar News